Begin typing your search above and press return to search.

వారిపై రోహిత్ సేన రివేంజ్ పక్కా... విక్టరీ వెంకటేష్ అంచనా అదుర్స్!

ఇందులో భాగంగా... ఈ ప్రపంచ కప్ లో ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న నాలుగు జట్ల మధ్యనే సెమీస్ ఉంటుందని వెంకటేష్ అంచనా వేసారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 8:43 AM GMT
వారిపై రోహిత్  సేన రివేంజ్  పక్కా... విక్టరీ వెంకటేష్  అంచనా అదుర్స్!
X

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు క్రికెట్ అంతే ఎంత అభిమానం అనేది తెలిసిన విషయమే. ఏమాత్రం అవకాశం ఉన్న ఇండియా ఆడే మ్యచ్ ల కోసం స్టేడియంలో ప్రత్యక్షమైపోతాడు. టీం ఇండియా ప్లేయర్స్ కు తనదైన శైలిలో ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఇండియా – ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ వెంకీ ప్రత్యక్షమయ్యాడు. ఆ మ్యాచ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశానని చెబుతున్న వెంకీ... సెమీస్, ఫైనల్స్ మ్యాచ్ లపై జోస్యం చెబుతున్నారు. ఇది తన అంచన అని క్లారిటీ ఇస్తున్నాడు.

అవును... భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన హీరో వెంకటేష్.. ఈ వరల్డ్ కప్ లో సెమీస్, ఫైనల్స్ లో తలపడే టీంస్ తోపాటు కప్ విన్నర్ పైన తన అంచనాలను వెల్లడించారు. ఇందులో భాగంగా మ్యాచ్ పైన కామెంట్రీ బాక్స్ లో సందడి చేసిన వెంకీ మామ... రోహిత్ బ్యాటింగ్ తీరును ప్రశంసించారు. ఇదే సమయంలో బౌలర్లు షమీ, బూమ్రా, కుల్ దీప్ బంతితో చేసిన అద్భుతాలనూ కొనియాడారు. అనంతరం ఫ్యూచర్ మ్యాచ్ లపై తన అంచనా తెలిపారు.

ఇందులో భాగంగా... ఈ ప్రపంచ కప్ లో ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న నాలుగు జట్ల మధ్యనే సెమీస్ ఉంటుందని వెంకటేష్ అంచనా వేసారు. అంటే... భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ కు వెళ్తాయని.. ఈ నాలుగు టీంల మధ్య జరిగే ఆ రెండు మ్యాచ్ లు అత్యంత రసవత్తరంగా సాగుతాయని వెంకీ తన అంచననా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఫైనల్ ఏయే దేశాల మధ్య జరుగుతాదో కూడా వెంకీ ఒక అంచనా వేశారు.

ఈ క్రమంలో... సెమీస్ లో ఇండియా న్యూజిలాండ్ టీం లు గెలిచి ఫైనల్ ఆడతాయని తెలిపారు. అయితే... 2019 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై ఈసారి ఫైనల్ లో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుని మరోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుందని, కప్పు ఎగరేసుకుపోతుందని వెంకీ చెప్పుకొచ్చారు. దీంతో... ఇప్పుడు వెంకీ చెప్పిన జోస్యం ఏమేరకు ఫలిస్తుందో అని కొంతమంది ఆలోచిస్తుంటే... జరిగేదే చెప్పారంటూ మరికొంతమంది ఆన్ లైన్ వేదికగా వంతపాడుతున్నారు!

కాగా... ప్రపంచకప్‌ లో టీం ఇండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా ఇంగ్లాడ్ తో గెలిచిన మ్యాచ్ తో వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచి రికార్డ్ సృష్టించింది. ఇందులో భాగంగా... 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ను చిత్తు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో టీం ఇండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక భూమిక పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ (87; 101 బంతుల్లో 10×4, 3×6) "మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు వరించింది.

ఇక ఈ మ్యచ్ లో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇండియన్ బౌలర్స్ గురించి. ఇందులో భాగంగా... వరల్డ్ కప్ లో కాస్త ఆలస్యంగా అయినా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సధివినియోగం చేసుకుంటున్న షమీ... ఈ మ్యాచ్ లోనూ చెలరేగాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్స్ కి ముప్పుతిప్పలు పెట్టాడు. ఫలితంగా... 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు!

ఇదే సమయంలో... బుమ్రా (3/32) ఇంగ్లిష్ బ్యాటర్స్ ని తనదైన స్వింగ్స్ తో విలవిలల్లాడించగా... కుల్‌ దీప్‌ (2/24) మరోసారి తనదైన మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుకోవడంతో... వన్డే ప్రపంచకప్‌ లో ఆరుసార్లు నాలుగు వికెట్లు తీసుకున్న బౌలర్ గా షమీ రికార్డ్ సృష్టించాడు. దీంతో... అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన బౌలర్‌ గా స్టార్క్‌ (6)ను సమం చేశాడు.