Begin typing your search above and press return to search.

భారత్ గుండె పగిలింది.. ఒలింపిక్ గోల్డ్ కల చెదిరింది.. వినేశ్ పై వేటు.. రంగంలోకి మోదీ

వినేశ్ 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు.. కాదు కాదు. .2 కేజీలని భిన్నంగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 9:11 AM GMT
భారత్ గుండె పగిలింది.. ఒలింపిక్ గోల్డ్ కల చెదిరింది.. వినేశ్ పై వేటు.. రంగంలోకి మోదీ
X

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు అత్యంత చేదు అనుభవం.. 150 కోట్ల మంది గుండెలు పగిలే వార్త. ఒక్క రోజుల్లో ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ చేరి.. తొలి మ్యాచ్ లోనే జపాన్ కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ ను ఓడించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ అత్యంత బాధాకర పరిస్థితుల్లో డిస్ క్వాలిఫై అయ్యారు. బుధవారం జరిగే ఫైనల్లో పసిడి పతకం సాధిస్తుందన్న అందరి ఆశలు కల్లలయ్యాయి. మంగళవారం ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో వినేశ్‌ ఫైనల్‌ కు చేరింద. బుధవారం రాత్రి ఫైనల్స్ ఉంది. అమెరికా క్రీడాకారిణితో పట్టు పట్టాల్సి ఉంది. అయితే, ఉదయం వినేశ్ బరువును పరీక్షించారు. కొన్ని గ్రాముల అదనపు బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో పతకం చేజారింది. ఇప్పుడు వినేశ్ కు రజతమూ దక్కదు. అసలు ఈ ఫార్మాట్ లో రజతాన్ని ఎవరికీ కేటాయించడం లేదు. నిన్న వినేశ్ చేతిలో సెమీస్ లో ఓడిన రెజ్లర్ కు కాంస్యం.. వినేశ్ డిస్ క్వాలిఫై తో అమెరికా రెజ్లర్ కు స్వర్ణం అందనున్నాయి. మరోవైపు పారిస్‌ ఒలింపిక్స్‌ లో అనర్హత వేటు కారణంతో వ్యథ చెందిందో ఏమో కానీ.. వినేశ్ అస్వస్థతకు గురైంది. డీ హైడ్రేషన్‌ తో పారిస్‌ లోని ఆసుపత్రిలో చేరింది.

అదనం వందగ్రాములా? 2 కేజీలా?

వినేశ్ 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు.. కాదు కాదు. .2 కేజీలని భిన్నంగా చెబుతున్నారు. దీనిలో ఏది నిజమో స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు వినేశ్ కొన్ని గ్రాముల బరువు పెరగిందని భారత ఒలింపిక్‌ సంఘం వెల్లడించింది. ఆమెపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్‌ చేసేందుకు కూడా సిద్ధమైంది. రాత్రి సెమీస్‌ లో తలపడిన ఫొగాట్‌ మరుసటి ఉదయానికే బరువు పెరగడంపైనా అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నంబర్ వన్ రెజ్లర్‌ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌ పై వేటు అందరినీ షాక్‌ కు గురి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్‌ చేస్తోంది.

రంగంలోకి మోదీ..

అభిమానుల తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉండగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. వినేశ్ కు ధైర్యం చెప్పారు. ఆమెను చాంపియన్లకే చాంపియన్‌ అని అభివర్ణించారు. తన ప్రతిభ దేశానిక గర్వకారణం అని కొనియాడారు. భారతీయులందరికీ వినేశ్ స్ఫూర్తి అని సర్దిచెప్పారు. ‘‘నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. ఇది మాటల్లో చెప్పలేను. నువ్వు బయటపడి బలంగా తిరిగి రాగలవని నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా అండగా ఉన్నాం’’ అని మోదీ ధైర్యం చెప్పారు. అంతేకాదు.. మోదీ భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు, మేటి అథ్లెట్ అయిన పీటీ ఉషకు ఫోన్ చేశారు. వినేశ్‌ పై అనర్హతకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. నిషేధాన్ని సవాల్‌ చేసేందుకు ఉన్న అవకాశాలు తెలుసుకున్నారు. వినేశ్‌ కు మేలు చేకూరుతుందంటే.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకే భారత్‌ నిరసనను గట్టిగా తెలియజేయాలని పీటీ ఉషను కోరినట్లు సమాచారం.