Begin typing your search above and press return to search.

నాడు రోడ్డుపై - నేడు మ్యాట్ పై భారత సివంగి వినేశ్‌ సంచలనం!

అవును... గత ఏడాది మాజీ రెజ్లింగ్ ప్యానెల్ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Aug 2024 5:22 AM GMT
నాడు రోడ్డుపై - నేడు మ్యాట్  పై భారత సివంగి వినేశ్‌  సంచలనం!
X

జీవితంలో కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు, నష్టాలు వచ్చాయని నిలిచిపోకూడదు, అవమానాలు వచ్చాయని ఆగిపోకూడదు... ఇవన్నీ చేతలతో చేసి చూపించింది భారత సింవంగ్ వినేష్ ఫోగాట్. పెద్దగా అంచనాలు లేకుండా ఒలింపిక్స్ లో ఎంట్రీ ఇచ్చి స్వర్ణం / రజతం పతకానికి చేరువలో ఉంది. ఇప్పుడు ఈమెకు సంబంధించిన "నాడు-నేడు" ఫోటో వైరల్ గా మారింది.


అవును... గత ఏడాది మాజీ రెజ్లింగ్ ప్యానెల్ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమంలో వినేశ్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నడి రోడ్డుపై పోలీసులు ఆమెను ఈడ్చి పరేసిన పరిస్థితి! ఈ సమయంలో ఆమె ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. దీంతో... ఇక ఆమె పనైపోయిందనే మాటలు వినిపించడం మొదలైంది.

కారణం బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంతో ఆమె మ్యాట్ పై కంటే బయటే ఎక్కువ సమయం గడిపింది. గత ఏడాది జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేశ్ తో పాటు బజ్ రంగ్, సాక్షి మాలిక్ తదితరులు ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఆందోళన విరమించని బెదిరంపులు వచ్చినా వీరు బెదరలేదు.. పగలూ రాత్రీ తేడా లేకుండా రోడ్లపైనే నిద్రించారు.

ఈ నేపథ్యంలోనే ఓ దశలో తాము సాధించిన పతకాలను గంగలో కలిపేందుకూ సిద్ధమయ్యారు. ఖేల్ రత్న సహా తన పురస్కారాలను వెనక్కిచ్చేసిన వినేశ్ ఎంతో వేదన అనుభవించింది. ఈ ఉద్యమంతో దేశంలో రెజ్లింగ్ కార్యకాలాపాలు ఆయిపోయాయంటూ.. వినేశ్ సహా ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని అవమానపరుస్తూ జూనియర్ రెజ్లర్లు, కోచ్ లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కానీ బయట సమస్యలను, సవాళ్లను దాటి, మ్యాట్ పై ప్రతాపం చూపించిన వినేశ్.. అదరగొట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల విభాగంలో సెమీస్ లో క్యూబాకు చెందిన గుజ్మన్‌ లోపేజ్ ను 5-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో... వినేశ్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ తో వినేశ్ తలపడుతోంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ లో గెలిచి వినేశ్ స్వర్ణ పతకం సాధించాలని కోరుకుందాం...!!