Begin typing your search above and press return to search.

రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కు గాయం?

దాదాపు పన్నెండేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు మరొక్క విజయం దూరంలో ఉన్న టీమ్ ఇండియాకు షాకింగ్ న్యూస్..

By:  Tupaki Desk   |   8 March 2025 4:17 PM IST
రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కు గాయం?
X

దాదాపు పన్నెండేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు మరొక్క విజయం దూరంలో ఉన్న టీమ్ ఇండియాకు షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ కు అనూహ్యంగా గాయం కావడంతో జట్టులో కలవరం మొదలైంది. అది కూడా పాత గాయమైన ప్రదేశంలోనే కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

పాకిస్థాన్ పై అద్భుత సెంచరీ.. ఆస్ట్రేలియాపై 84 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడి మంచి ఫామ్ లో ఉన్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి న్యూజిలాండ్ తో ఫైనల్లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికితగ్గట్లే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లికి అనూహ్య పరిస్థితి ఎదురైంది.

నెట్ ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లి మోకాలికి గాయమైందట. దీంతో అతడు వెంటనే ప్రాక్టీస్ ఆపేసి వెళ్లినట్లు సమాచారం. వాస్తవానికి కోహ్లి ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో ఆడలేదు. కారణం.. మోకాలి గాయం. ఇపుడు అదే గాయం తిరగబెట్టిందా? లేక మరో గాయమా? అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ కోహ్లికి గాయం తీవ్రమైనది అయితే జట్టుకు అది చాల షాకింగే. ఈ కారణంగా కోహ్లి ఫైనల్ మ్యాచ్ కు దూరమైతే చాలా ఇబ్బందికరమే. అతడి స్థానంలో రిషభ్ పంత్ ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కోహ్లి ఇలాంటి గాయాన్ని లెక్క చేయడు. అతడు మైదానంలోకి దిగి జట్టు విజయానికి పాటుపడతాడని భావిస్తున్నారు.