Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ 'బ్రాండ్' ప‌డిపోయిందా!

అయితే, ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్‌ల్‌ల‌లో పేల‌వ‌మైన ఆట‌తీరు కార‌ణంగా కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఇటీవ‌ల ప‌డిపోయింద‌నే అంచ‌నాలు వ‌చ్చాయి

By:  Tupaki Desk   |   28 Sep 2023 2:30 PM GMT
విరాట్ కోహ్లీ  బ్రాండ్ ప‌డిపోయిందా!
X

ఇదొక ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం. భార‌త క్రికెట్ టీంలో తిరుగులేని ఆట‌గాడుగా ఉన్న విరాట్ కోహ్లీకి బ్రాండ్ వాల్యూ భారీగా ఉంద‌నే విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ బ్రాండ్ వాల్యూ బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్ క‌న్నా వెనుక బ‌డిపోయింద‌నే విష‌యం వెలుగు చూసింది. విరాట్ కోహ్లీకి మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా భార‌త్‌లో అయితే.. ఈ ఫాలోయింగ్ మ‌రింత ఎక్కువ‌.

అయితే, ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్‌ల్‌ల‌లో పేల‌వ‌మైన ఆట‌తీరు కార‌ణంగా కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఇటీవ‌ల ప‌డిపోయింద‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. దీనికి సంబంధించి తాజాగా వ‌చ్చిన క‌థ‌నాల‌ను చూస్తే.. కోహ్లీ వెనుక‌బాటు అర్థ‌మ‌వుతుంది. లెజండ‌రీ క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో అప్పుడప్పుడు ఆడుతున్న విష‌యం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ధోనీ పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. అయిన‌ప్ప‌టికీ ధోనీ బ్రాండ్ వాల్యూ మాత్రం అదే రేంజ్‌లో కొన‌సాగుతోంది.

వాస్త‌వానికి సెలబ్రిటీ బ్రాండ్ అంటే.. అన్ని కోణాల్లోనూ దూకుడుగా ఉండాలి.అప్పుడే విస్తృత శ్రేణి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది. ఈ బ్రాండ్ వాల్యూనే భ‌విష్య‌త్ స‌క్సెస్‌కు ఆధార‌ప‌డి ఉంటుంది. ఇలా చూసిన‌ప్పుడు ర‌ణ‌వీర్ బ్రాండ్ ఫ్యూచ‌ర్‌పై మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచుతోంది. ఇదిలావుంటే, మ‌రో ఆరేడు సంవ‌త్స‌రాల్లో కోహ్లీ క్రికెట్ కు గుడ్‌బై చెప్ప‌నున్నాడు. ఇది.. ర‌ణ‌వీర్‌కు క‌లిసి వ‌చ్చిన అంశంగా మారింది.

న‌ట‌న‌కు, న‌టుడుకి రిటైర్‌మెంట్ లేదు. బ్రాండ్ వాల్యుయేషన్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆన్-ఫీల్డ్ లేదా ఆన్-స్క్రీన్ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది బహుముఖ ప్రజ్ఞ, విస్తృత ప్రేక్షకులను ఆకర్షించడం, భవిష్యత్ విజయానికి పునాదులు వేస్తుంది. జనాదరణ పొందిన నటులు వారి సుదీర్ఘ కెరీర్, విభిన్న ఆకర్షణ కారణంగా, బ్రాండ్ భాగస్వామ్యాలు, క్రీడా ప్రముఖుల కంటే వృద్ధిలో ఉంటోంది. దీంతో వారు విస్తృత‌ ప్రయోజనాన్ని కలిగి ఉంటారు.

సెలబ్రిటీల బ్రాండ్ ఎంపికలు వారి వ్యక్తిగత ఆకాంక్షలు, ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి. విరాట్ కోహ్లి ఆరోగ్యం-ఆధారిత పరిణతి చెందిన బ్రాండ్‌లపై దృష్టి పెట్టడం, రణవీర్ సింగ్ సౌకర్యవంతమైన విధానం వారి ప్రత్యేక వ్యూహాలను హైలైట్ చేస్తాయి. బ్రాండ్ వాల్యుయేషన్ అనేది బహుముఖ ప్రజ్ఞ, భవిష్యత్తు సంభావ్యత మరియు వ్యక్తిగత బ్రాండ్ వ్యూహంతో సహా కారకాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య, ఇది సెలబ్రిటీ తక్షణ పనితీరు లేదా వారి సంబంధిత రంగాలలో ప్రజాదరణకు మించి ఉంటుంది. వాస్త‌వానికి ర‌ణ‌వీర్ క‌న్నా కూడా కోహ్లీకి అనేక మంది ఫాలో వ‌ర్లు, ఫ్యాన్సు ఉండొచ్చు. కానీ, బ్రాండ్ వాల్యూ అనేది మాత్రం పూర్తిగా భిన్న‌మైంది కావ‌డం గ‌మ‌నార్హం.