చాంపియన్స్ ట్రోఫీ: భారత్ పాక్ వెళ్లదు..టి20 కప్ భారత్ కు పాక్ రాదు
వన్డే ప్రపంచ కప్ తర్వాత పెద్ద టోర్నీ అయిన చాంపియన్స్ ట్రోఫీ అసలు జరుగుతుందా? లేదా? అని అనుమానం నెలకొంది.
By: Tupaki Desk | 14 Dec 2024 12:30 PM GMTహై. .హై.. హైబ్రిడ్.. ‘దుబాయ్’ లైన్ క్లియర్..న అక్కడా ఇక్కడా కాదు.. ఆడేద్దాం దుబాయ్ లో అంటూ చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతోంది టీమ్ ఇండియా. సరిగ్గా రెండు నెలలు కూడా సమయం లేదు.. అటు చూస్తే ఆతిథ్య దేశం పాకిస్థాన్ పట్టువీడడం లేదు. భారత్ మాత్రం తాము పాకిస్థాన్ లో పర్యటించేది లేదు అని చెబుతోంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ సందిగ్థంలో పడింది. వన్డే ప్రపంచ కప్ తర్వాత పెద్ద టోర్నీ అయిన చాంపియన్స్ ట్రోఫీ అసలు జరుగుతుందా? లేదా? అని అనుమానం నెలకొంది.
ఎట్టకేలకు..
దాదాపు నాలుగు నెలలుగా చాంపియన్ ట్రోఫీ నిర్వహణపై రగడ రగడ జరుగుతోంది. భారత్ తమ దేశానికి రాకుంటే తాము ఆ దేశానికి వెళ్లేది లేదని పాకిస్థాన్ పట్టుపట్టింది. అటు చూస్తే సమయం దగ్గర పడుతోంది. పైగా ఈసారి టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయితే, ఎట్టకేలకు ఈ సందిగ్ధతకు తెరపడింది.
హైబ్రిడ్ క్ ఓకే..
చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మధ్య ఒప్పందం కుదిరింది. హైబ్రిడ్ మోడల్ అంటే.. ఏమీ లేదు.. కొన్ని మ్యాచ్ లు ఆతిథ్య దేశంలో, మిగతావి వేరే దేశంలో జరగడం.
భారత్ కు దుబాయ్..
పాకిస్థాన్ లోని నాలుగు నగరాల్లో 2025 ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరగనున్నాయి. మిగిలినవి పాక్ లోనే జరుగుతాయి. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే నిర్వహిస్తారు. భారత్ ముందుగానే నిష్క్రమిస్తే ఈ మ్యాచ్ లు లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి. కాగా, పీసీబీకి ఐసీసీ మరో ఆఫర్ కూడా ఇచ్చాందట. 2027 తర్వాత జరిగే మహిళల ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు పాక్ కు కేటాయించినట్లు సమాచారం.
పాక్ భారత్ కు రాదు..
భారత్ లో 2026 టి20 ప్రపంచ కప్ జరగనుంది. ఇందుకోసం పాకిస్థాన్ జట్టు భారత్ కు రాదు. దాని మ్యాచ్‌లు శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతాయి. కాగా, చాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధం తొలగడంతో త్వరలో షెడ్యూల్ రానుంది. ఈ టోర్నీ ప్రారంభానికి మూడున్నర నెలు (100 రోజులు) ముందుగానే షెడ్యూల్ ఇవ్వాలి. కానీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఐసీసీ వాయిదా వేసింది.