Begin typing your search above and press return to search.

ఐరన్ లెగ్: ఫైనల్ మ్యాచ్ అంపైర్ లు తేడా కొట్టేలా ఉన్నారా?

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మహా ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:31 AM GMT
ఐరన్ లెగ్: ఫైనల్ మ్యాచ్ అంపైర్ లు తేడా కొట్టేలా ఉన్నారా?
X

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మహా ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక జట్టు ఫైనల్ కు చేరిందంటే ఆషామాషీ కాదు. కొన్నిసార్లు లక్ బాగుండి వచ్చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నం. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు భారతజట్టు నిలిస్తే.. రెండు మ్యాచ్ లు ఓడినప్పటికీ ఫైనల్ పోరుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా ఆసీస్ ను చెప్పాలి.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరుకు రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ హౌఓల్టేజ్ మ్యాచ్ కు అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. అయితే.. జాబితా విడుదల చేసిన తర్వాత అందులో కనిపించిన పేర్లను చూసిన భారత అభిమానులు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఐసీసీ ప్రకటించిన అంపైర్ ప్యానల్ లో టీమిండియా పాలిట ఐరన్ లెగ్ అంపైర్ ఒకరున్నట్లుగా చెబుతున్నారు.

ఫైనల్ మ్యాచ్ కు సీనియర్ అంపైర్లు.. రిచర్డ్ కెటిల్ బరో.. రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ లు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా.. థర్డ్ అంపైర్ గా జోయెల్ విల్సన్.. ఫోర్త్ అంపైర్ గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన ముగ్గురు అంపైర్లతో సమస్య లేదు కానీ.. రిచర్డ్ కెటిల్ బరో విషయంలోనే భారత క్రీడాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి టెన్షన్ ఏమంటే.. 2014 లీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు ఇతగాడు అంపైరింగ్ చేసిన ఏ మ్యాచ్ లోనూ టీమిండియా గెలిచింది లేదు. ముఖ్యంగా ఇతను అంపైరింగ్ చేసిన నాకౌట్.. ఫైనల్ మ్యాచ్ లలో గడిచిన తొమ్మిదేళ్లలోటీమిండియా గెలిచింది లేదు. దీంతో.. అతగాడి ఎంట్రీ ఆందోళనను కలిగిస్తోంది.

రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచ్ లలో టీమిండియా ఓటమి జాబితాను చూస్తే.. ఈ వాదన నిజమేననిపించక మానదు. టీమిండియా పాలిట ఐరన్ లెగ్ గా చెప్పే ఇతగాడి అంపైరింగ్ లో ఈ ఫైనల్ ఏం కానున్నదన్నది టెన్షన్ పుట్టిస్తోంది.

నిజంగానే ఐరన్ లెగ్గా? అంటే కావాలంటే ఈ లిస్టు చూడండంటూ చెబుతున్నారు.

- 2014లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ధోనీ కెప్టెన్ గా టీమిండియా జట్టు శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది.

- 2015 వన్డే ప్రపంచకప్ లోనూ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

- 2016 టీ20 వరల్డ్ కప్ లోనూ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో అనూహ్య ఓటమి

- 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ లోనూ పాక్ చేతిలో ఓటమి

- 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి

- 2021, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఓటమి పాలైంది. ఈ రెండు ఫైనల్స్ కు మాత్రం థర్డ్ అంపైర్ గా వ్యవహరించారు. ఇలా అతగాడు ఏ కీలక మ్యాచ్ కు అంపైరింగ్ చేసినా భారత జట్టు పాలిట ఐరన్ లెగ్ గా మారారన్న పేరుంది. అలాంటి పెద్దమనిషి.. ఈసారి ఫైనల్ పోరుకు అంపైరింగ్ చేయనున్నారు. మరి.. ఈ సెంటిమెంట్ ఈసారితో బ్రేక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.