ఏమో గుర్రం ఎగరావచ్చు... సెమీస్ అవకాశాలు ఇలా ఉన్నాయి!
ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు పాయింట్ల పట్టికపై అందరి దృష్టీ పడింది. ఏయే టీం లు సెమీస్ కి వెళ్తాయి.. వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 6 Nov 2023 6:40 AM GMTవన్డే ప్రపంచకప్ లో జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా ఎనిమిదో మ్యాచ్ లోనూ టీం ఇండియా భారీ విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీస్ చేరిన రోహిత్ సేన.. మరో సెమీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఏకంగా 243 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తూ.. ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ తో టీం ఇండియా మరికొన్ని రికార్డులు నెలకొల్పింది.
ఇందులో భాగంగా... అతి ముఖ్యంగా పుట్టిన రోజు నాడు ప్రపంచ కప్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లి అరుదైన రికార్డ్ సాధించాడు. ఇంతకుముందు రాస్ టేలర్ (2011), మిచెల్ మార్ష్ (2023) ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. ఇదే సమయంలో... ప్రపంచకప్ మ్యాచ్ లో అయిదు వికెట్ల ఘనత సాధించిన భారత స్పిన్నర్లలో జడేజా చేరాడు. అంతకముందు యువరాజ్ (2011లో ఐర్లాండ్ పై 5/31) ఉన్నాడు
ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు పాయింట్ల పట్టికపై అందరి దృష్టీ పడింది. ఏయే టీం లు సెమీస్ కి వెళ్తాయి.. వెళ్లే అవకాశాలు ఉన్నాయి.. సెమీస్ లో భారత్ ఏ జట్టుతో తలపడనుంది.. మొదలైన పెరామీటర్స్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే సెమీస్ కి చేరిన భారత్, దక్షిణాఫ్రికా ల అనంతరం ఏయే జట్లు చేరే అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం
ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్ లలోనూ గెలిచిన టీం ఇండియా... 16 పాయింట్లతో +2.45 నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక రెండో ప్లేస్ లో దక్షిణాఫ్రికా ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ 6 మ్యాచ్ లు గెలిచి 12 పాయింట్లతో +1.37 నెట్ రన్ రేట్ తో రెండో ప్లేస్ లో ఉంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీస్ కి చేరుకున్నాయి. ఈ సమయంలో ఇక సెమీస్ కి చేరే మిగిలిన రెండు జట్లూ ఏవి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఆడిన 7 మ్యాచ్ లోనూ 5 మ్యాచ్ లలో గెలిచిన ఆస్ట్రేలియా... 10 పాయింట్లతో +0.92 నెట్ రన్ రేట్ తో సెమీస్ ఆశలు ప్రస్తుతానికి సజీవంగా ఉంచుకుంది. ఆసీస్ కి మరో రెండు మ్యాచ్ లు బాకీ ఉన్నాయి. దీంతో ఆ రెండు మ్యాచ్ లలోనూ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లపై ఆసీస్ కచ్చితంగా గెలవాలి. అలా జరిగితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే... సెమీస్ కి చేరే మూడో టీం ఆసిస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్ కు ఇంక ఒకటే మ్యాచ్ మిగిలిఉంది. ఆ మ్యాచ్ లో శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే... సెమీస్ ఆశలకు అవకాశం ఉండోచ్చు. ఇక ప్రస్తుతం 8 పాయింట్లతో పాజిటివ్ రన్ రేట్ తో ఐదోస్థానంలో ఉన్న పాకిస్థాన్... ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ విజయం నమోదు చేస్తే... కాస్త అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఎవరి అంచనాలకూ అందకుండా ఫెర్మార్మ్ చేస్తున్న అఫ్గనిస్తాన్ సెమీస్ అంచనాలను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్ లలో 4 గెలిచి 8 పాయింట్లతో 6 స్థానంలో ఉన్న ఆఫ్గన్ జట్టు.. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై గెలవాలి. ప్రస్తుతం ఆ టీం ఉన్న ఫాం ప్రకరం చూస్తే... ఏమో గుర్రం ఎగరావచ్చు!
ఇక మిగిలిన నాలుగు స్థానాల్లోనూ ఉన్న శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లాడ్ లకు సమీపంలో సెమీస్ ఆశలు కనిపించడం లేదనే చెప్పుకోవాలి. శ్రీలంకకు ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగా... ప్రస్తుతం ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉంది. ఇక బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ టీం లకు ఏమాత్రం అవకాశం లేదనే అనుకోవాలి!! ఆ దారులు మూసుకుపోయి చాలా రోజులే అయ్యింది!