టాస్ తో యాంటీ సెంటిమెంట్ : వరల్డ్ కప్ వండర్
మ్యాచ్ భారత్ గెలవాలని క్రికెట్ అభిమానులతో పాటు దేశం మొత్తం దేవుళ్ళకు మొక్కుకుంటోంది.
By: Tupaki Desk | 18 Nov 2023 4:18 PM GMTభారతదేశం అంతటా ఇపుడు వరల్డ్ కప్ ఫీవర్ రాజుకుంది. కేవలం కొద్ది గంటలు మాత్రమే వ్యవధి ఉంది. ఆదివారం మధ్యాహ్నం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య భారీ పోరుకు తెర లేవనుంది. మ్యాచ్ భారత్ గెలవాలని క్రికెట్ అభిమానులతో పాటు దేశం మొత్తం దేవుళ్ళకు మొక్కుకుంటోంది.
ఇదిలా ఉంటే వరల్డ్ కప్ విషయంలో ఉన్న సెంటిమెంట్లు యంటీ సెంటిమెంట్లను ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. వరల్డ్ కప్ లో టాస్ గెలిచిన జట్టు ఎక్కువ సార్లు కప్ గెలవలేదు అని చరిత్ర చెబుతున్న సత్యంగా ఉంది.
మొత్తం చరిత్రను ఒకసారి చూస్తే కనుక టాస్ గెలిచిన టీం నాలుగు సార్లు కప్ గెలిస్తే టాస్ ఓడిన జట్టు మాత్రం ఎనిమిది సార్లు గెలిచి కప్ కొట్టేసి ప్రపంచ విజేతగా రికార్డు నమోదు చేసుకుంది. ఈ యాంటీ సెంటిమెంట్ ని క్రికెట్ అభిమానులు ఈ కీలక తరుణంలో గుర్తుకు తెస్తున్నారు.
ఆదివారం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరులో టాస్ కనుక గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ కి దిగే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే టాస్ ఓడిన జట్టు బౌలింగ్ తో రావాలి. ఇపుడు భారత్ గెలవాలని కోరుకుంటున్న మొత్తం కోట్లాదిమంది జనం టాస్ ఎవరు గెలుస్తారా అని కోట్లాది కళ్లతో చూస్తున్నారు.
టాస్ కనుక అస్ట్రేలియా గెలిస్తే భారత్ కచ్చితంగా కప్ కొట్టేస్తుంది అని కూడా అంటున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రపంచ కప్ ని రెండు సార్లు భారత్ గెలిచింది. ఆ రెండు సార్లూ కూడా టాస్ ఓడిపోయింది. ఇపుడు కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నారుట. అంటే జాతకం అంతా ఇపుడు టాస్ మీద ఆధారపడింది అని అంటున్నారు.
ఇక భారత్ రేపు టాస్ గెలుస్తుందా గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలా లేక బౌలింగ్ ఎంచుకోవాలా యాంటీ సెంటిమెంట్ ని ఎలా అధిమగించాలి అన్నది క్రికెట్ అభిమానుల బుర్రలను బద్ధలు కొట్టేస్తోందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.