Begin typing your search above and press return to search.

21 ఏళ్ల టీమ్ ఇండియా క్రికెటర్ గుండెకు అత్యవసర చికిత్స

భవిష్యత్ లో టీమ్ ఇండియాకు ఆడతాడనే అంచాలున్న యువ బ్యాట్స్ మన్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 10:30 AM GMT
21 ఏళ్ల టీమ్ ఇండియా క్రికెటర్ గుండెకు అత్యవసర చికిత్స
X

భవిష్యత్ లో టీమ్ ఇండియాకు ఆడతాడనే అంచాలున్న యువ బ్యాట్స్ మన్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సహజంగా క్రీడాకారులంటే ఫిట్ గా ఉంటారు.. శారీరకంగానే కాదు మానసికంగానూ వారు ఫిట్ గా కనిపిస్తారు. రోజువారీ వ్యాయామం.. పౌష్టికాహారం.. ఉన్నత స్థాయి జీవనం తదితరాల కారణంగా క్రీడాకారుల లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఓ యువ క్రికెటర్ అనూహ్యంగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.

చాంపియన్ కెప్టెన్

అండర్-19 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్. 2022లో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ కు సారథ్యం వహించాడు ఢిల్లీ కుర్రాడు యశ్ ధుల్. ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న ధుల్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 23 మ్యాచ్ లలో 40 ఇన్నింగ్స్ ఆడి 1,610 పరుగులు చేశాడు. సగటు 45. ఈ రికార్డులు చూసినవారు కుడిచేతి వాటం బ్యాటర్ ధుల్ త్వరలో భారత జట్టుకు ఆడతాడనే అంచనాకు వచ్చారు. అయితే, ధుల్ అనూహ్యంగా అస్వస్థతకు గురయ్యాడు.

ఇండియా ఎ జట్టు సభ్యుడు..

ధుల్ ఇండియా-ఎ జట్టు సభ్యుడు కూడా. జూన్-జూలైలో అండర్-23 స్థాయిలో అత్యుత్తమ ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్ అకాడమీలో శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి ధుల్ కూడా అర్హత సాధించాడు. అయితే, శిబిరం సమయంలో అతడి గుండెలో రంధ్రం ఉన్నట్లు తేలింది. దీంతో శస్త్రచికిత్స చేశారు. గత నెలలోనే అతడికి సర్జరీ చేశారు. 15 రోజుల్లోనే కోలుకున్న ధుల్.. 80 శాతం ఫిట్ నెస్ సాధించాడు. ఇప్పుడు ఢిల్లీ ప్రిమియర్‌ లీగ్‌ ఆడుతున్నాడు. అందులో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ కు తరఫున ఐదు ఇన్నింగ్స్‌ లలో 93 పరుగులు చేశాడు. వంద శాతం ఫిట్ నెస్ లేకున్నా.. 80 శాతం ఫిట్ నెస్ సరిపోతుందంటూ అతడిని ఆడిస్తున్నారు. కాగా, ధుల్ కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. అది 20 ఏళ్లు దాటాక బయటపడడం గమనార్హం. అది కూడా అత్యంత తీవ్ర పోటీ ఉండే క్రికెట్ ను ఎంచుకని ఓ స్థాయికి చేరాక కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా, ధుల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సొంత రాష్ట్రమైన ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు మెరుగైన ఇన్నింగ్స్ ఆడలేదు.