Begin typing your search above and press return to search.

జైశ్వాల్ మళ్లీ వార్తల్లో.. ఈసారి రూమర్ గర్ల్ ఫ్రెండ్ తో..

టీమ్ ఇండియా యువ ఓపెనర్, కాబోయే టెస్టు కెప్టెన్ గా పేరున్న యశస్వి జైశ్వాల మళ్లీ వార్తల్లో నిలిచాడు.

By:  Tupaki Desk   |   5 April 2025 9:30 AM
జైశ్వాల్ మళ్లీ వార్తల్లో.. ఈసారి రూమర్ గర్ల్ ఫ్రెండ్ తో..
X

టీమ్ ఇండియా యువ ఓపెనర్, కాబోయే టెస్టు కెప్టెన్ గా పేరున్న యశస్వి జైశ్వాల మళ్లీ వార్తల్లో నిలిచాడు. కొన్నాళ్ల కిందట వరకు భారీ సెంచరీలు, మెరుపు ఇన్నింగ్స్ తో మీడియాలో కనిపించిన జైశ్వాల్.. రెండు రోజులుగా కెరీర్ కు సంబంధించిన వివాదాలతో హైలైట్ అవుతున్నాడు. రంజీట్రోఫీలో దిగ్గజం అనదగ్గ ముంబై జట్టును వదిలి.. అనామక గోవా జట్టుకు మారడంతో జైశ్వాల్ స్థాయికి తగని పని. అయితే, దీని వెనుక అతడు ముంబై కెప్టెన్ అజింక్య రహానేతో పెట్టుకున్న పేచీనే కారణమని బయటపడింది.

గత దేశవాళీ సీజన్ లో ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు జైశ్వాల్ రంజీట్రోఫీలో ఆడాల్సి వచ్చింది. కానీ, జమ్మూ కశ్మీర్ తో మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో జైశ్వాల్ కేవలం 4, 26 పరుగులు చేశాడు. వాస్తవానికి జైశ్వాల్ కోసం.. అప్పటికే కుదురుకున్న ముంబై జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందట. తీరా యశస్వి వచ్చినా రాణించింది లేకపోవడంతో విమర్శలు రేగాయి. దీనికిముందు కూడా హైదరాబాదీ ఆటగాడు రవితేజను స్లెడ్జింగ్ చేసినందుకు జైశ్వాల్ ను రహానే గ్రౌండ్ బయటకు పంపాడు.

మరోవైపు కశ్మీర్ తో మ్యాచ్ అనంతరం జైశ్వాల్ ఆటతీరును ప్రశ్నించినందుకు కెప్టెన్ రహానే కిట్ బ్యాట్ ను తన్నాడని కథనాలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ముంబై జట్టులో ఇమడలేక జైశ్వాల్ గోవా బాట పట్టాడని నేషనల్ మీడియా రాస్తోంది.

జైశ్వాల్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. కారణం.. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ మ్యాడీ హామిల్టన్ తో కలిసి అతడు దిగిన సెల్ఫీనే. ఈ ఫొటోలో హామిల్టన్ సోదరుడు కూడా ఉన్నాడు. అయితే, ఆమెతో జైశ్వాల్ కొన్నాళ్లుగా ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. జైశ్వాల్ ఎక్కడ మ్యాచ్ ఆడినా హామిల్టన్ ప్రత్యక్షం అవుతోంది. ఇది మూడేళ్లుగా జరుగుతుండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బయటకూడా ఇద్దరూ చాలాసార్లు కనిపించడంతో దీనికి బలం చేకూరుతోంది.

కాగా జైశ్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. మంచి ప్లేయర్ కావడంతో రిటైన్ చేసుకున్నప్పటికీ ఈ సీజన్ లో నిరుత్సాహపరుస్తున్నాడు.

గాడి తప్పుతున్నాడా?

జైశ్వాల్ వయసు కేవలం 23. అతడు ఇప్పటికే టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడు అయ్యాడు. సక్సెస్ లో ఉన్నాడు. దీంతోనే ఆ సక్సెస్ తలకెక్కించుకుంటున్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఐపీఎల్ లో అతడు 3 మ్యాచ్ లలో 34 పరుగులే చేశాడు. క్రికెట్ నుంచి జైశ్వాల్ ఫోకస్ మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కథనాలు వస్తున్నాయి. ఇలాగే వివాదాలు చుట్టుముడితే జైశ్వాల్ కెరీర్ కు ముప్పు ఉన్నట్లే.

జైశ్వాల్ అంతా బాగుంటే సరిగ్గా రెండు నెల్లలో టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ అవడం ఖాయం. చేజేతులా పరిస్థితులను క్లిష్టం చేసుకుంటే తప్ప.. బహుపరాక్ టీమ్ ఇండియా యువ ఓపెనర్.