Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లో విన్నర్.. రెస్టారెంట్ లో వర్కర్.. ఎవరీ యాకిన్..?

వివరాళ్లోకి వెళ్తే... చైనాకు చెందిన జిమాస్ట్ జౌ యాకిన్ 18 ఏళ్లకే ఒలింపిక్ పతకం గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   20 Aug 2024 6:52 AM GMT
ఒలింపిక్స్  లో విన్నర్.. రెస్టారెంట్  లో వర్కర్.. ఎవరీ యాకిన్..?
X

ఒక్కసారి ఒలింపిక్స్ లో పతకం సాధించిన తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుంది? ప్రభుత్వాల నగదు బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్లు, ఇంటి స్థలం బహుకరణ, బ్రాండ్ అంబాసిడర్ హోదా ఇలా రకరకాల ప్రయోజనాలతో వారి లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది అని అనుకుంటారు! అయితే అది అందరి విషయాల్లోనూ కాదనే విషయం వాస్తవం అని చెప్పే తాజా ఉదాహరణ ఒకటి తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్ ని చూస్తే పైన చెప్పుకున్నవి అందరి విషయాల్లోనూ వాస్తవం కాదనే సత్యం తెలుస్తుందని చెప్పుకోవచ్చు! ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో పతకం నెగ్గిన జౌ యాకిన్ సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఒలింపిక్స్ లో పతకం సాధించిన యాకిన్.. స్వదేశానికి తిరిగివచ్చాక తన రోజువారీ పనుల్లో నిమగ్నమైంది.

వివరాళ్లోకి వెళ్తే... చైనాకు చెందిన జిమాస్ట్ జౌ యాకిన్ 18 ఏళ్లకే ఒలింపిక్ పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా పోడియం వద్ద నిల్చొని అమాయకంగా మెడల్ ను ముద్దాడింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో మరింత వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె ఓ రెస్టారెంట్ లో భోజనం వడ్డిస్తూ కన్పించింది.

చైనాలోని హునాన్ ప్రావిస్న్ లో గల హెన్ గ్యాంగ్ సిటీలో యాకిన్ ఫ్యామిలీకి ఓ రెస్టారెంట్ ఉంది. పారిస్ ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన ఆమె.. వచ్చీ రాగానే ఎప్పటిలానే తన రెస్టారెంట్ పనుల్లో నిమగ్నమైపోయింది. ఒలింపిక్స్ దుస్తుల్లోనే ఆమె ఫుడ్ సర్వ్ చేస్తున్న దృశ్యాలను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

ఎవరీ యాకిన్..?:

యాకిన్ చైనీస్ అమ్మాయి. ఆమె 18ఏళ్ల వయసులో పారిస్ లోనే ఒలింపిక్స్ కు అరంగేట్రం చేసింది. అయితే... ఇలా ఫస్ట్ ఎంట్రీతోనే రజతం అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పతకం అందుకున్న అనంతరం స్వర్ణ, కాంస్య పతకదారులతో కలిసి నిల్చుని ఉండగా.. మిగిలిన ఇద్దరూ తమ పతకాలను నోటితో కొరికి ముద్దాడారు.

ఆ సమయంలో దాన్ని చూసిన యాకిన్.. వారిని అనుసరిస్తూ తన పతకాన్ని నోటి వద్ద పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ సమయంలో ఆమె అమాయకపు చూపులకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ పుట్టుకొచ్చారనే చెప్పాలి.

కాగా... ఈ మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్ లో ఇటలీకి చెందిన అలీస్ డిమాంటో స్వర్ణం, అదే దేశానికి చెందిన మనీలా ఎస్పోసిటో కాంస్యం గెలుచుకున్నారు.