'యానిమల్'.. ఓటీటీలోనూ ఊచకోతే!
డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ. 915 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.
By: Tupaki Desk | 31 Jan 2024 8:30 AM GMTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ. 915 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.
థియేటర్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోనూ అదరగొడుతుంది. జనవరి 26 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'యానిమల్' కేవలం మూడు రోజుల్లోనే 20 మిలియన్ గంటలకు పైగా వీక్షణలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా చూసుకుంటే 6 మిలియన్ల 2 లక్షల వ్యూస్ తో ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన ఘనతని సొంతం చేసుకుంది.
అప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ప్రభాస్ 'సలార్' యానిమల్ దెబ్బతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్స్ సైతం టాప్-10 లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. ఈ నంబర్స్ అన్నీ కేవలం నెట్ ఫ్లిక్స్ లో అధికారికంగా చూసినవే కావడం విశేషం. ఓటీటీలో 'యానిమల్' హవా మరి కొన్ని వారాల పాటు కొనసాగేలా కనిపిస్తోంది.
థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఎగబడి మరీ చూస్తున్నారు. సినిమాపై విమర్శలు ఇప్పటికీ ఏమాత్రం ఆగలేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విమర్శలపై స్పందించడం మానేశారు. ఓటీటీలో 'యానిమల్' మేనియా ఏ రేంజ్ లో ఉందంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ అనిల్ కపూర్ ని 'పప్పా' అని ఎన్నిసార్లు పిలిచాడో నంబర్స్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
సినిమా మొత్తంలో రణ్బీర్ కపూర్ 'పప్పా' అని 196 సార్లు ఉచ్చరించాడని ఓ అభిమాని వీడియో ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలో పెట్టేసరికి ఆ వీడియోని స్వయంగా ఇక నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఆ రేంజ్ లో యానిమల్ మ్యానియా గా నడుస్తుంది. చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటిదాకా హైయెస్ట్ నంబర్స్ అందుకున్న 'RRR' ని కూడా అవలీలగా దాటేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతోంది. 'యానిమల్ పార్క్' పేరుతో 2025 ఎండింగ్ లో దీన్ని రిలీజ్ చేయనున్నారు.