బ్రో ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
అయితే బ్రో సినిమా ఓటీటీ హక్కులు మొదట అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది
By: Tupaki Desk | 28 July 2023 10:11 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ మరో కథానాయకుడుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. కాస్త మిక్స్ డ్ టాక్ తో వెళుతున్న ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.
బాక్సాఫీస్ వద్ద అయితే చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగ్గట్టుగా ఈ సినిమా దాదాపు 100 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే అందుకోవాల్సి ఉంటుంది. ఇక నిర్మాతలు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చేసుకున్నారు. ఇక ఇప్పుడు థియేట్రికల్ గా సినిమా ఎంత కలెక్షన్స్ అందిస్తుందో చూడాలి. అయితే బ్రో సినిమా ఓటీటీ హక్కులు మొదట అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది.
కానీ చిత్ర నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ రావడంతో వారికే సినిమా ఓటీపీ హక్కులను అమ్మేశారు. ఇక నేడు థియేట్రికల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.
అసలైతే రూల్స్ ప్రకారం 50 రోజుల థియేట్రికల్ రిలీజ్ తర్వాతనే బ్రో సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలి అని మొదట ఒక టాక్ అయితే వినిపించింది. ఇక ఇప్పుడు అయితే సినిమా ఫలితాన్ని బట్టి డేట్ విషయంలో మార్పులు చేసే అవకాశం ఉందట. నెట్ ఫ్లిక్స్ వారు అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన బ్రో సినిమాను స్ట్రీమింగ్ చేయాలి అని నిర్మాతలతో ముందుగానే చర్చలు జరిపింది.
కానీ ఆ విషయంపై ఇంకా నిర్మాతల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఒకవేళ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం అదే రోజున రావచ్చు అని తెలుస్తోంది. బ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో TG విశ్వప్రసాద్ నిర్మించగా తమిళ దర్శకుడు నటుడు సముద్రఖని తెరపైకి తీసుకువచ్చారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కేతిక శర్మ కీలక పాత్రలలో నటించారు.