Begin typing your search above and press return to search.

'డాకు మహారాజ్‌' ఓటీటీ... దబిడి దిబిడి ఉందిగా!

డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించడం మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కనిపించింది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 9:15 AM GMT
డాకు మహారాజ్‌ ఓటీటీ... దబిడి దిబిడి ఉందిగా!
X

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొంది మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'డాకు మహారాజ్‌'. బాలకృష్ణ ఈ సినిమాతో వరుసగా నాల్గవ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అభిమానులు వెయిట్‌ చేశారు. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టి బాలకృష్ణకు డబుల్‌ హ్యాట్రిక్‌ దక్కింది. సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించడం మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కనిపించింది. ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ చేసిన దబిడి దిబిడి సాంగ్‌ వివాదాస్పదం అయింది. బాలీవుడ్‌కి చెందిన సినీ విమర్శకులతో పాటు కొందరు సౌత్‌ ఇండియన్ విమర్శకులు సైతం దబిడి దిబిడి డాన్స్ స్టెప్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్‌తో పాటు పాటలో నటించిన ఊర్వశి రౌతేలాను, హీరో బాలకృష్ణను తీవ్రంగా విమర్శించారు. ఎంతగా విమర్శలు వచ్చాయో అదే స్థాయిలో పాటకు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా దేశ విదేశాల్లోనూ దబిడి దిబిడి స్టెప్‌లు వైరల్‌ అవుతున్నాయి.

దబిడి దిబిడి సాంగ్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి క్రేజ్ పెరిగింది. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ రెండు మూడు రోజులు ఉంది అనగా ఊర్వశి రౌతేలా పాటతో పాటు, సన్నివేశాలు అన్నింటిని తొలగించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. డాకు మహారాజ్‌లో ఊర్వశి రౌతేలా కనిపించకుండానే ఓటీటీ వర్షన్‌ నెట్‌ఫ్లిక్స్ ద్వారా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఓటీటీ ద్వారా డాకు మహారాజ్ వచ్చేసింది. వెంటనే ప్రేక్షకులు సినిమాను చూడటం, ఊర్వశి రౌతేలా సినిమాలో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఊర్వశి రౌతేలా లేదు అంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.

డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా గ్లామర్ డాల్‌గా నిలిచింది. అలాంటి పాత్రలో నటించిన ఊర్వశిని ఎలా తొలగిస్తారు. ఆమె చేసిన పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఎందుకు ఆ పాటను తొలగిస్తారు అంటూ కొందరు ప్రశ్నించారు. సినిమాకు కావాలనే కొందరు నెగటివ్‌ టాక్ స్ప్రెడ్‌ చేయాలనే ఉద్దేశంతో పుకార్లు పుట్టించారు. ఊర్వశి రౌతేలా సన్నివేశాలు ఉండటంతో పాటు మరోసారి నందమూరి అభిమానులు దబిడి దిబిడి స్టెప్పులు ఎంజాయ్ చేసే విధంగా ఓటీటీ వర్షన్‌లో ఆమె కనిపించారు. డాకు మహారాజ్‌ సినిమాను తెలుగులోనే కాకుండా అన్ని సౌత్‌ ఇండియన్‌ భాషల్లో, హిందీలోనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.