డబ్బా కార్టెల్ వెబ్ సీరీస్ ఎలా ఉంది..?
బాలీవుడ్ లో సినిమాలకు ఈక్వల్ గా వెబ్ సీరీస్ ల హంగామా ఉంటుంది. అందుకే అక్కడ వెబ్ సీరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
By: Tupaki Desk | 2 March 2025 10:15 PM ISTబాలీవుడ్ లో సినిమాలకు ఈక్వల్ గా వెబ్ సీరీస్ ల హంగామా ఉంటుంది. అందుకే అక్కడ వెబ్ సీరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్టార్స్ కూడా హిందీలో వెబ్ సీరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ వెబ్ సీరీస్ లో ఫిమేల్ సెంట్రిక్ కథలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా బాలీవుడ్ లో వచ్చిన వెబ్ సీరీస్ డబ్బా కార్టెల్. హితేష్ భాటియా డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ లో షబానా ఆజ్మీ, జ్యోతిక, షాలిని పాండే, జిషు సేన్ గుప్తా, నిమిషా సజయన్ నటించారు.
లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ డబ్బా కార్టెల్ కు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అసలు ఈ డబ్బా కార్టెల్ వెబ్ సీరీస్ కథ ఏంటంటే.. షీలా (షబానా ఆజ్మీ) కోడలైన రాజీ ఎంప్లాయీస్ కు లంచ్ బాక్స్ ఇచ్చే బిజినెస్ చేస్తుంది. ఆమెకు మాల (నిమిషా సజయన్), షాహిదా (అంజలి ఆనంద్)లు సాయం చేస్తుంటారు. ఐతే ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారి జీవితాలు ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో లంచ్ బాక్స్ లో అంజాయి, డ్రగ్స్ ని సప్లై చేస్తుంటారు. దీనికి మాల ప్రియుడు సంతోష్ సాయం చేస్తాడు.
ఇలా జరుగుతున్న వ్యవహారం బయటకు రావడంతో ఒక్కసారిగా అందరు రిస్క్ లో పడతారు. శంకర్ ఫార్మా నుంచే ఆ డ్రగ్స్ బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. దానితో శంకర్ ఫ్యామిలీ రిస్క్ లో పడుతుంది. రాజీ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నదే డబ్బా కార్టెల్ కథ. మంచి కథ.. దానికి తగినట్టుగానే చాలా పాపులర్ నటీనటులను ఎంపిక చేశారు. ఐతే కథనం మాత్రం అంత ఎంగేజింగ్ గా రాసుకోలేదు.
సీరీస్ ని ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. 7 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ డబ్బా కార్టెల్ సీరీస్ ప్రేక్షకులను అలరించడంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఏదో ఒకసారి టైం పాస్ కి ఎలా చూసేయొచ్చు అనిపిస్తుంది కానీ తప్పనిసరిగా చూడాలి అన్నంతగా అయితే ఏమి లేదు. స్టార్ కాస్ట్ భారీగా ఉన్నా వారిని కూడా సరిగా వాడుకున్నట్టు అనిపించలేదు. కామెడీ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు.నటీనటులు వారికి ఇచ్చిన పాత్రల్లో బెస్ట్ ఇచ్చారు. ఐతే డైరెక్టర్ మాత్రం ఇంకాస్త వర్క్ చేసి ఉంటే సీరీస్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అనిపిస్తుంది.