Begin typing your search above and press return to search.

భీమా - గామి.. ఓటీటీ సంగతేంటి?

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఓటీటీ డీల్స్ ఫిక్స్ అయిపోయాయి. భీమా మూవీ శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకోగా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   11 March 2024 8:30 AM GMT
భీమా - గామి.. ఓటీటీ సంగతేంటి?
X

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భీమా. మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిట్ అయితే పదేళ్ల తర్వాత గోపీచంద్ సక్సెస్ ఖాతా తెరిచినట్లు అవుతుంది.

ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ లీడ్ రోల్ విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గామి. ఈ సినిమాలో మానవ స్పర్శ తగిలితే ఎలర్జీకి గురయ్యే విచిత్రమైన రోగంతో బాధపడుతూ దానిని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తిగా విశ్వక్ పాత్ర ఉంటుంది. మూవీ మెజారిటీ షూటింగ్ హిమాలయాల్లోని జరిగింది. ఈ సినిమా పూర్తి చేయడానికి డైరెక్టర్ కు చాలా టైమ్ పట్టింది.

ట్రైలర్ తోనే భారీ అంచనాలని క్రియేట్ చేసిన మూవీకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అలాగే థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. హై రేంజ్ లో విఎఫ్ఎక్స్, విజువల్స్ ఉన్నాయని, కథలో కూడా కొత్తదనం ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది. ఈ వీకెండ్ లో గామి సూపర్ హిట్ బొమ్మగా మారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఓటీటీ డీల్స్ ఫిక్స్ అయిపోయాయి. భీమా మూవీ శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకోగా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అలాగే గామి మూవీ డిజిటల్ రైట్స్ ని జీ5 ఛానల్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులు జీ తెలుగుకి వచ్చాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీలోకి రావడానికి ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు.

థియేటర్స్ లో రిలీజ్ అయిన 6 లేదా 7 వారాల అనంతరం ఓటీటీ రిలీజ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారంట. ఇక థియేట్రికల్ గా అయితే రెండు సినిమాలకు ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్లు అందుతున్నాయి. ఇక ముందుగానే ఓటీటీ డీల్స్ ద్వారా నిర్మాతలకు ప్రాఫిట్స్ దక్కినట్లు టాక్. ఇక థియేట్రికల్ గా బాక్సాఫీస్ వద్ద సోమవారం నుంచి మరిన్నీ కలెక్షన్స్ అందుకోవాలి. మరి ఈ రెండు సినిమాలు ఎన్ని రోజుల వరకు సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.