Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ అప్డేట్

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:44 AM GMT
గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ అప్డేట్
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా క‌నీస వ‌సూళ్లు కూడా సాధించ‌లేక‌పోయింది. దాదాపు రూ.400 కోట్ల‌తో రూపొందిన గేమ్ ఛేంజ‌ర్.. నిర్మాత దిల్ రాజుకు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీ మొత్తంలోనే న‌ష్టాల‌ను మిగిల్చింది.

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ అంచ‌నాల‌తో రిలీజైన సినిమా ఇదే. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన గేమ్ ఛేంజ‌ర్ కాన్సెప్ట్ అవుట్‌డేటెడ్ అవ‌డంతో పాటూ శంక‌ర్ మార్క్ మిస్ అవ‌డంతో ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక పోయింది. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దీనిపై ఇన్‌డైరెక్ట్ గా అప్డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్ట‌బుల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు ప్రైమ్ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ చెప్పిన డైలాగు ఇది. ఈ డైలాగుని ప్రైమ్ వీడియో పోస్ట్ చేయ‌డంతో ఆ అనౌన్స్‌మెంట్ గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ గురించేన‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ వారంలోనే గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్స‌వం సందర్భంగా గేమ్ ఛేంజ‌ర్ ను ఫిబ్ర‌వ‌రి 14న ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు భాష‌తో పాటూ మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళం, హిందీ భాష‌ల్లో కూడా గేమ్ ఛేంజ‌ర్ స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యాన్స్ స‌ద‌రు ఓటీటీ సంస్థ‌ను ఓ విష‌యంలో రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమాను ఎక్స్‌ట్రా ర‌న్ టైమ్ తో రిలీజ్ చేయమ‌ని మెగా ఫ్యాన్స్ ప్రైమ్ వీడియోను అడుగుతున్నారు. శంక‌ర్ చెప్పిన 5 గంట‌ల ఫుటేజ్ అవ‌స‌రం లేద‌ని, మ‌రికొంత నిడివి జోడించి బాగా ఎడిట్ చేసిన ఫుటేజ్‌ను రిలీజ్ చేస్తే చాల‌ని వారు కోరుతున్నారు. మ‌రి దీనిపై ప్రైమ్ వీడియో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించగా, చ‌ర‌ణ్ ఈ సినిమాలో అప్ప‌న్న‌, రామ్ నంద‌న్ అనే రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించాడు. చ‌ర‌ణ్ కెరీర్లో అప్ప‌న్న బెస్ట్ క్యారెక్ట‌ర్ అని రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తన 16వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.