Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్నర్ పై వాళ్లు అసంతృప్తి..!

బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ ని ప్రకటించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Dec 2024 10:23 AM GMT
బిగ్ బాస్ విన్నర్ పై వాళ్లు అసంతృప్తి..!
X

బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం గ్లోబల్ స్టార్ రాం చరణ్ చేతుల మీదగా నిఖిల్ టైటిల్ ని అందుకున్నాడు. ఈ సీజన్ మొదటి వారం నుంచి నిఖిల్ తన స్ట్రాంగ్ ఆట తీరుతో మెప్పిస్తూ వచ్చాడు. ఐతే కొందరి వల్ల అతని గ్రాఫ్ పడిపోయినా సరే చివర్లో మళ్లీ పుంజుకున్నాడు. సీజన్ 8 టైటిల్ రేసులో నిఖిల్, గౌతం ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఏర్పడింది.

ఐతే ఒక దశలో నిఖిల్ కాదు గౌతమే విన్నర్ అన్నట్టుగా పరిస్థితులు కనిపించాయి. వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం కూడా విన్నర్ క్వాలిటీస్ సంపాదించాడు. ముఖ్యంగా నిఖిల్ గా గ్రూప్ ఆట ఆడకుండా సోలో ఆట ఆడుతూ వచ్చాడు. అంతేకాదు ఏదైనా పాయింట్ పెట్టడంలో అవతల వ్యక్తితో ఆర్గ్యుమెంట్ జరపడంలో గౌతం ముందు ఉంటాడు. ఆ ఫైటింగ్ స్పిరిట్ వల్లే అతను రన్నరప్ గా నిలిచాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో అసలైతే గౌతమే విన్నర్ అవ్వాల్సింది కానీ నిఖిల్ ని స్టార్ మా కావాలనే విన్నర్ ని చేశారని చెప్పుకుంటున్నారు.

బిగ్ బాస్ రిజల్ట్ అనేది కంప్లీట్ గా ఆడియన్స్ ఓటింగ్ ని బట్టే డిసైడ్ చేస్తారు. ఐతే నిఖిల్ కన్నా గౌతం కే ఎక్కువ ఓట్స్ వచ్చినా కావాలని నిఖిల్ ని విన్నర్ గా అనౌన్స్ చేశారని గౌతం ఫ్యాన్స్ వాధిస్తున్నారు. రాత్రి విన్నర్ అనౌన్స్ మెంట్ టైం లో అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా గౌతం ఫాలోవర్స్ చాలామంది వచ్చారు. ఐతే పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్త్ వల్ల వాళ్లు ఎలాంటి ఆందోళన చేయలేదు.

స్టార్ మా సీరియన్స్ చేస్తాడు కాబట్టే నిఖిల్ ని గెలిపించి గౌతం ని ఓడకొట్టారని గౌతం ఫ్యాన్స్ అంటున్నారు. ఐతే అలా చేసే అవకాశం కానీ.. అవసరం కానీ బిగ్ బాస్ టీం కు, నాగార్జునకు ఉండదు. గౌతం, నిఖిల్ ఇద్దరు టాప్ 2 కి వచ్చారు. ఎవరికి ఆడియన్స్ ఓట్ వేస్తారో వారినే ప్రకటిస్తారు. ఇందులో బిగ్ బాస్ టీం చేసే మార్పులు ఏమి ఉండవని చెప్పొచ్చు. అయినా కూడా గౌతం ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ విన్నర్ అవ్వడం అనేది సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. టాప్ 2 కి చేరిన వారిలో ఒకరు విన్నర్ అయ్యి మరొకరు రన్నర అయితే ఎవరి ఫాలోవర్స్ కి అయినా ఇలానే బాధగా ఉంటుంది. కానీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తే వారినే విన్నర్ గా ప్రకటిస్తారు తప్ప వేరే మార్పు చేసే ఛాన్స్ ఉండదు.