Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి హరోం హర.. ఒక్కదాంట్లోనే..

అమెరికాలో హరోం హర మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.

By:  Tupaki Desk   |   15 July 2024 1:45 PM GMT
ఓటీటీలోకి హరోం హర.. ఒక్కదాంట్లోనే..
X

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు.. రీసెంట్ గా హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాళ‌విక శ‌ర్మ హీరోయిన్‌ గా నటించిన ఈ మూవీని జ్ఞాన సాగర్ ద్వారక తెరెక్కించారు. అయితే రిలీజ్ కు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ.. అనుకున్నంత స్థాయిలో సినీ ప్రియులను మెప్పించలేకపోయింది. సుధీర్ బాబు మాత్రం యాక్షన్ తో శభాష్ అనిపించుకున్నారు.

అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ఆహాతో పాటు ఈటీవీ విన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జూలై 11వ తేదీన ఓటీటీల్లోకి వస్తున్నట్లు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. తండ్రీకూతురి వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మూవీలో చిన్న పాత్రలో నటించడం వల్ల స్ట్రీమింగ్ వాయిదా వేశారు. అతడు నటించిన సీన్లను తొలగించి స్ట్రీమింగ్ ను చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు హరోం హర సినిమా.. ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ లవర్స్ ఇబ్బంది పడకూడదని.. వీలైనంత త్వరగా ఆహా స్ట్రీమింగ్ చేసినట్లు సమాచారం. అయితే వాయిదా నిర్ణయం వచ్చాక.. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. కానీ ఆహా మాత్రం అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు సడెన్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో హరోం హర మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.

హరోం హర స్టోరీ లైన్ ఇదే!

సుబ్ర‌హ్మ‌ణం (హీరో సుధీర్ బాబు) కుప్పంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అనుకోకుండా కొందరితో గొడవలు వల్ల.. ఉద్యోగం పోతుంది. దీంతో డబ్బుల కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. గ‌న్ స్మ‌గ్లింగ్ బిజినెస్‌ లోకి సుబ్ర‌హ్మ‌ణం ఎంట్రీ ఇస్తాడు. వివిధ గన్లను తయారు చేస్తాడు. అలా ఆ ఏరియాలో గాంగ్ స్టర్ గా మారిపోతాడు.

అయితే సామాన్య మనిషి అయిన సుబ్ర‌హ్మ‌ణ్యం తిరుగులేని ఓ గ్యాంగ్‌ స్ట‌ర్‌గా ఎలా ఎదిగాడు? ఓ ఇద్దరి నుంచి కుప్పం ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. కేజీఎఫ్‌, విక్ర‌మ్, పుష్ప సినిమాల నుంచి స్ఫూర్తి పొంది డైరెక్టర్ ఈ మూవీని తెర‌కెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సినీ ప్రియులు చూసేందుకు రెడీ అవుతున్నారు.