Begin typing your search above and press return to search.

ఈవారం తప్పకుండా మిస్ కాకూడని ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

వీకెండ్ వస్తుంది అంటే ఓటీటీ ప్రియులకు సందడే సందడి.

By:  Tupaki Desk   |   20 Sep 2024 8:06 AM GMT
ఈవారం తప్పకుండా మిస్ కాకూడని ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
X

వీకెండ్ వస్తుంది అంటే ఓటీటీ ప్రియులకు సందడే సందడి. గత కొద్దికాలంగా థియేటర్లో సినిమాలు చూడడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అంతకుమించి ఇంటి వద్ద హ్యాపీగా ఆన్లైన్ సినిమాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు సినీ లవర్స్. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సిరీస్, సినిమాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటేటిలో సందడి చేయడానికి సినిమాలు,వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..

ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం ఇప్పటికే కలినరీక క్లాస్ వార్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ తో పాటు ది క్వీన్ ఆఫ్ విలన్స్ అనే జపనీస్ వెబ్ సిరీస్ విడుదలయ్యాయి. ఇక ఈరోజు విక్రమ్ నటించిన

తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 21న హిందీ రియాల్టీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 నెక్లెస్ ప్లాట్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో తెలుగు వెబ్ సిరీస్

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, తమిళ్ వెబ్ సిరీస్ తలైవేట్టాయామాపాళ్యం ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతాయి. సెప్టెంబర్ 21న ది జడ్జ్ ఫ్రమ్ హెల్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగువారి ఓటీటీ ఆహాలు ఈరోజు నుంచి రావు రమేష్ నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక జియో సినిమాలు జో తేరా హై వో మేరా హై అనే హిందీ సినిమా,ది పెంగ్విన్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈవారం విడుదలైన ఈ అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లోకి పత్తికరంగా ఉన్నవి చియాన్ విక్రమ్ తంగలాన్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం, తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని చెప్పవచ్చు. ఇక మూవీ లవర్స్ ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ని నాన్ స్టాప్ సినిమాలతో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.