ప్రశంసించిన జ్యోతిక విమర్శలపై ఏమంటారు?
తాజాగా ఇద్దరు యువతుల మధ్య ప్రేమ వివాదాస్పదంగా మారింది.
By: Tupaki Desk | 15 March 2025 12:29 PM ISTఅప్పుడప్పుడు వివాదాస్పద చిత్రాలు రిలీజ్ అవ్వడం సహజమే. అందులోనూ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రాలపై విమర్శలు పరిపాటే. తాజాగా ఇద్దరు యువతుల మధ్య ప్రేమ వివాదాస్పదంగా మారింది. ఇటీవలే తమిళ్ లో రూపొంది 'కాదల్ ఎన్నబదు పొదువడమై' అనే చిత్రం రిలీజ్ అయింది. ఇద్దరి యువతుల మధ్య ప్రేమ కథను చెప్పే చిత్రమిది. 'జై భీమ్' ఫేం లిజోమోల్ జోస్ ఇందులో లెస్బియన్‌గా నటించారు.
అలాగే తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ రిలీజ్ అనంతరం డిమాండ్లు మొదలయ్యాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరమని...యువత చెడిపోవడానికి ఆస్కారం ఉన్న చిత్రమని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమ య్యాయి.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. తమిళ ఓటీటీ సంస్థ టెంట్‌కొట్ట రిలీజ్ చేసింది. ఓటీటీ రిలీజ్ లోనూ బాగానే రాణిస్తుంది. అక్కడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయితే మరింత ప్రమాదకరంమంటూ కొందరు నెటి జనులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రిలీజ్ బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి సినిమా తమిళ్ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉంది.
ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై జ్యోతిక ప్రశంసలు కురిపించారు. మంచి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారంటూ దర్శక నిర్మాతలను మెచ్చుకున్నారు. మరి ఈ విమర్శలపై జ్యోతిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని 'లెన్స్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన జయప్రకాశ్ తెరకెక్కించారు. గ్లోవింగ్ టంగ్ట్‌న్- మ్యాన్‌కైండ్ సినిమాస్- నిత్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.