Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ ఇలా బుక్కైందేంటి?

అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ తొలి చిత్రం థియేట‌ర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 6:37 AM GMT
స్టార్ కిడ్ ఇలా బుక్కైందేంటి?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ తొలి చిత్రం థియేట‌ర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తోంది. `ది అర్చిస్` తో న‌టిగా ప్ర‌వేశించిన అమ్మ‌డు అటుపై పూర్తి స్థాయి హీరోయిన్ గా సినిమా చేయ‌డానికి చాలా స‌మయం తీసుకుంది. చివ‌రిగా ఇబ్ర‌హీం అలీఖాన్ కి జోడీగా `న‌దానియన్` చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇదొక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. ఈ చిత్రాన్ని శౌనా గౌత‌మ్ తెర‌కెక్కిస్తున్నారు.

జాన్వీ క‌పూర్ ని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలా అక్కా-చెల్లెళ్ల జీవితంలో క‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈసినిమా థియేట‌ర్లో రిలీజ్ అవుతుంద‌ని ఖుషీ క‌పూర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుంది. తొలిసారి త‌న‌ని తాను బిగ్ స్క్రీన్ చూసుకోవాల‌ని ఎంతో ఆశ ప‌డుతుంది. అయితే ఆ ఆశ నిరాశ‌గానే మారింది.

ఈ చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మార్చి 1న ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ఖుషీ క‌పూర్ ఆశ అడియాశ అయింది.

ఖుషీ క‌పూర్ న‌టించిన `ది అర్చిస్` కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఆ సిరీస్ నే థియేట‌ర్లో రిలీజ్ చేస్తే బాగుండేద‌ని అప్ప‌ట్లో ఖుషీ అభిప్రాయ ప‌డింది. కానీ మేక‌ర్స్ నిర్ణ‌యాన్ని కాద‌నే హ‌క్కు త‌మ‌కు లేద‌ని సైలైట్ అయింది.

ఇప్పుడు తొలిసారి హీరోయిన్గా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా విషయంలో కూడా అదే ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో ఖుషీ క‌పూర్ త‌న‌ని తాను తెర మీద చూసుకోవడానికి ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్లు అయిన స‌మయం ప‌డుతుంది. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం కొత్త సినిమా క‌మిట్ అవ్వాలి. అది పూర్తి చేసి రిలీజ్ అవ్వ‌డానికి ఆ మాత్రం స‌మయం త‌ప్ప‌నిస‌రి.