Begin typing your search above and press return to search.

ఆ హిట్‌ మూవీ ప్రీక్వెల్‌ వచ్చింది చూశారా..!

కానీ ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఓటీటీ లో చూడాలని చాలా ఆరాట పడటం, సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాలను తెలియజేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   4 July 2024 5:36 AM GMT
ఆ హిట్‌ మూవీ ప్రీక్వెల్‌ వచ్చింది చూశారా..!
X

హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'ఫ్యూరియోసా : ఎ మాడ్‌ మాక్స్‌ సాగా' ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఇండియన్ హాలీవుడ్‌ సినిమాల ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెర పడింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తుంది.

మే 23, 2024 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఇతర దేశాల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అంచనాలకు మించి వసూళ్లు నమోదు అయినట్లుగా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వర్గాల వారు పేర్కొన్నారు. కానీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశ పరిచింది.

ఆ సమయంలో ఉన్న పరిస్థితులు మరియు ఇతర కారణాల వల్ల ఫ్యూరియోసా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఓటీటీ లో చూడాలని చాలా ఆరాట పడటం, సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాలను తెలియజేయడం జరిగింది.

ఇండియాలో ఈ సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అమెజాన్‌ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయడం మొదలు పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ను చూడాలి అంటే రెంట్‌ కు తీసుకోవాల్సిందే. ఈ విషయం అమెజాన్‌ యూజర్స్ కి కాస్త చిరాకు తెప్పిస్తోంది.

అద్దెకు ఇలా ఎన్ని రోజులు సినిమా ఉంటుంది అనేది చూడాలి. సాధారణంగా రెండు లేదా మూడు వారాల్లోగా సినిమాను అందరికీ అందుబాటులో ఉండే విధంగా సాధారణ ఖాతాదారులకు కూడా ఉచితంగా చూపించడం జరుగుతుంది. జార్జ్ మిల్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అన్య టేలర్‌ - జాయ్‌ మరియు ఎవెంజర్స్‌ స్టార్‌ క్రిస్‌ హేమ్స్ వర్త్‌ లు ముఖ్య పాత్రల్లో కనిపించారు.