Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ ఓటీటీ అప్డేట్‌

ఎట్టకేలకు కిచ్చా సుదీప్‌ 'మ్యాక్స్‌' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ అధికారికంగా వచ్చింది.

By:  Tupaki Desk   |   14 Feb 2025 10:53 AM GMT
హిట్‌ మూవీ ఓటీటీ అప్డేట్‌
X

కిచ్చా సుదీప్‌ హీరోగా విజయ్ కార్తికేయన్ దర్శకత్వంలో రూపొందిన మ్యాక్స్ మూవీ గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన మాక్స్ సినిమాకు కన్నడ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తెలుగులో రాజమౌళి ట్వీట్‌ కారణంగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సుదీప్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో మాక్స్‌ నిలిచింది. నాలుగు వారాల్లో మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు మాక్స్‌ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఎట్టకేలకు కిచ్చా సుదీప్‌ 'మ్యాక్స్‌' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ అధికారికంగా వచ్చింది. ప్రముఖ ఓటీటీ జీ5 ద్వారా ఈ సినిమాను రేపటి నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్ సినిమా థియేటర్‌ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కన్నడంతో పాటు ఇతర భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. థియేట్రికల్‌ రిలీజ్‌ కంటే ఈమధ్య కాలంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు.

జీ 5 ద్వారా ఫిబ్రవరి 15 సాయంత్రం 7.30 స్ట్రీమింగ్‌ కాబోతుంది. సాధారణంగా అర్థ రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను ప్రత్యేకంగా సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్‌ చేయబోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. సోషల్‌ మీడియాలో సుదీప్ కిచ్చా ఫ్యాన్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి సంబంధించిన అప్డేట్‌ను పెద్ద ఎత్తున వైరల్‌ చేస్తున్నారు. స్ట్రీమింగ్‌ టైం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ తెగ హడావుడి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో సాధించిన విజయం కంటే ఓటీటీలో అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

మ్యాక్స్‌ కథ ఒక పోలీస్ ఆఫీసర్‌ చుట్టూ తిరుగుతుంది. చేయని తప్పు కారణంతో సస్పెండ్‌ అయిన పోలీస్‌ ఆఫీసర్‌ తన నిర్ధోషిత్వంను ఎలా నిరూపించుకున్నారు అనేది సినిమా కథాంశం. విభిన్నమైన కథాంశంతో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందింది. వి క్రియేషన్స్‌, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాతో కన్నడంలో కిచ్చా సుదీప్ స్టార్‌డం మరింతగా పెరిగింది. క్రిస్మస్‌ విజేతగా ఈ సినిమా నిలిచింది.