Begin typing your search above and press return to search.

పోస్టర్ లోనే కాదు.. మూవీలోనూ ఊర్వశి మిస్!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహరాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Feb 2025 7:30 PM GMT
పోస్టర్ లోనే కాదు.. మూవీలోనూ ఊర్వశి మిస్!!
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహరాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ మూవీ.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నెట్ ఫ్లిక్స్.. ఇటీవల పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పిక్ అందులో మిస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్.. ఆమె పిక్ ను పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో టాక్ వినిపిస్తోంది. డాకు మహారాజ్ మూవీలో ఊర్వశి ఉన్న సీన్స్ ను నెట్ ఫ్లిక్స్ తొలగించినట్లు ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే డాకు మహారాజ్ లో కీలక పాత్ర పోషించి స్పెషల్ సాంగ్ తో సందడి చేసిన ఆమె.. ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. మూవీపై బజ్ క్రియేట్ అవ్వడంలో తన వంతు పాత్ర పోషించింది. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ ఈవెంట్ లో సైఫ్ అలీఖాన్ దాడిపై పై స్పందించాల్సిందిగా మీడియా కోరింది.

అప్పుడు ఆమె.. డాకు మహరాజ్ సక్సెస్ కావడంతో తన తండ్రి రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారని చెప్పింది. అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చిందని తెలిపింది. కానీ, వాటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదని.. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. దీంతో అప్పుడు ఫుల్ గా ట్రోల్స్ వచ్చాయి.

ఆ తర్వాత తాను అలా అన్నందుకు సిగ్గుపడుతున్నానని, తనను క్షమించమని కోరింది. సైఫ్‌ పై దాడి దురదృష్టకరమని చెప్పింది. సైఫ్ సర్ గురించి మాట్లాడే సమయంలో ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. మరి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సీన్స్ ను నెట్ ఫ్లిక్స్ తొలగించిందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు.