ట్రెండ్ అవుతున్న జాలీ 'కర్రీ అండ్ సైనైడ్'
జాలీ కి చెందిన కథ తో కర్రీ అండ్ సైనైడ్ అనే డాక్యుమెంటరీ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ రూపొందించింది
By: Tupaki Desk | 26 Dec 2023 9:30 AM GMTకేరళ రాష్ట్రంలో కూడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే వివాహిత చేసిన మారణ హోమం 2014 సంవత్సరంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. వెనుకబడిన కుటుంబం కు చెందిన జాలీ మెట్టినింటికి వెళ్లిన తర్వాత తన నిజ స్వరూపం ను బయట పెట్టి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి, అత్తారింటికి చెందిన వారిని బ్యాక్ టు బ్యాక్ చంపేసింది.
జాలీ కి చెందిన కథ తో కర్రీ అండ్ సైనైడ్ అనే డాక్యుమెంటరీ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. పెళ్లి తర్వాత అడ్డదారులు తొక్కి, అక్రమ సంబంధాలు పెట్టుకున్న జాలీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది.
ఉద్యోగం చేయమన్నందుకు గాను అత్తను హత్య చేసిన జాలీ అక్కడి నుంచి ఒకొక్కరిని చొప్పున మామను, ఆ తర్వాత దగ్గరి బంధువు తో అక్రమ సంబంధం ఏర్పరచుకుని అతడి భార్య మరియు పిల్లలను చంపేసింది. అంతే కాకుండా తన విషయం గురించి తెలిసిన వారిని ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు చంపేస్తూ వచ్చింది.
జాలీ ఆడపడుచుకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అసలు విషయాలను బయటకు తీసేందుకు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. దాదాపు పదేళ్ల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. సొంత కొడుకే తన తల్లి హంతకురాలు అని చెప్పిన జాలీ కథ ను గంటా నలబై నిమిసాల డాక్యుమెంటరీగా నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ ని తెగ చూస్తున్నారు.