Begin typing your search above and press return to search.

యూజర్ నెత్తిన నెట్ ఫ్లిక్స్ పిడుగు

ఒక్కసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఆ ఐపీ అడ్రెస్ ఉన్న డివైజ్ లలో మాత్రమే వీడియోలు చూసే అవకాశం ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 July 2023 11:26 AM GMT
యూజర్ నెత్తిన నెట్ ఫ్లిక్స్ పిడుగు
X

బిగ్ స్క్రీన్ తో పాటు ఈ మధ్యకాలంలో డిజిటల్ ఒటీటీ ఎంటర్టైన్మెంట్ కి కూడా డిమాండ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ఆడియన్స్ డిజిటల్ ఛానల్స్ లో మూవీస్, వెబ్ సిరీస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఒటీటీ బిజినెస్ థియేటర్స్ ని దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని కొత్త సినిమాలని చూసే సౌకర్యం వీటిలో లభిస్తోంది.

అలాగే ఒటీటీ ఛానల్స్ ఆధిపత్యం కూడా పెరుగుతోంది. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఈ కాంపిటేషన్ వచ్చిన యూజర్ ని నిలుపుకోవడంతో పాటు, వారి నుంచి వీలైనంత ఎక్కువ మొత్తం సబ్ స్క్రైబ్ ద్వారా రాబట్టాలని డిజిటల్ ఛానల్స్ చూస్తున్నాయి. వీటిలో నెట్ ఫ్లిక్స్ మాత్రం ఎక్కువగా యూజర్ ని సబ్ స్క్రైబ్ కోసం ఇప్పటికే వసూలు చేస్తోంది. నెలవారీ చార్జీల ద్వారా నెట్ ఫ్లిక్స్ డబ్బులు వసూలు చేస్తోంది.

నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎంత మంది యూజర్స్ అయిన డిఫరెంట్ డివైజ్ లో చూసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఆప్షన్ మార్చేసింది. ఒక్కసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఆ ఐపీ అడ్రెస్ ఉన్న డివైజ్ లలో మాత్రమే వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరొక ఐపీ అడ్రెస్ ఉన్న వైఫై డివైజ్ లలో నెట్ ఫ్లిక్స్ ఒకే నెంబర్ నుంచి చూడాలంటే మాత్రం సాధ్యం కాదు.

ఒక వేళ అలా చూడాలంటే అదనంగా చార్జీలు చెల్లించాల్సిందే. దీనికి సంబందించిన ప్రకటనని కూడా నెట్ ఫ్లిక్స్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఇలా సబ్ స్క్రైబ్ చార్జీలు పెరగడంతో యూజర్స్ తగ్గే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఈ కొత్త సబ్ స్క్రైబ్ పాలసీ ఎంత వరకు ప్రభావం చూపిస్తుందనేది చూడాలి.

ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ రీజనల్ సినిమాలని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకి అయితే 40, 50 కోట్ల పైబడి డిజిటల్ రైట్స్ కోసం వెచ్చిస్తున్నాయి. వీటిని మరల తక్కువ టైమ్ లోనే వెనక్కి రాబట్టుకోవడం కోసం ఇలా యూజర్స్ మీద అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.