'పుష్ప 2'తో పాటు ఈ వారం రాబోతున్న సినిమాలు..!
అయితే పుష్ప 2 తో పాటు ఓటీటీ ద్వారా చాలా సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2024 10:10 AM GMTగత నెల రోజులుగా ఊరిస్తూ వస్తున్న పుష్ప 2 సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న పుష్ప 2 కి పోటీగా థియేటర్ల ద్వార ఏ భాషలోనూ పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. వారం రోజుల ముందు నుంచే పుష్ప కి లైన్ క్లీయర్ చేయడం జరిగింది. గత వారం సైతం సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. కనుక పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద వన్ సైడ్ వార్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా పుష్ప 2 వసూళ్లు ఉండటం ఖాయం. అయితే పుష్ప 2 తో పాటు ఓటీటీ ద్వారా చాలా సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
పుష్ప 2 సినిమాకి కచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఓటీటీ ద్వారా ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌లకు సైతం మంచి ఆధరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'అమరన్'. శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందిన ఆర్మీ మేజర్ ముకుంద్ బయోపిక్ అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈవారంలో పుష్ప 2 తో పాటు అమరన్ రాబోతుంది. థియేటర్ లో పుష్ప 2 ను ఎంతగా చూడాలి అనుకుంటున్నారో అమరన్‌ను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అమరన్ సినిమాతో పాటు ఓటీటీలో ఈవారం వినోదాల విందు చాలానే ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో అమరన్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా చర్చిల్ ఎట్ వార్, దట్ క్రిస్మస్, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా, ది అల్టిమేట్, జిగ్రా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంగ్లీష్ తో పాటు హిందీ సినిమాలు, సిరీస్‌లు వీకెండ్‌కి ప్రేక్షకులకు వినోదాల విందు అందించబోతుంది. డిసెంబర్ 4 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతున్నాయి. ఇంగ్లీష్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ఈ వారం మంచి కంటెంట్‌ను నెట్ ఫ్లిక్స్ అందించబోతుంది.
అమెజాన్ ప్రైమ్ ద్వారా జాన్ ఇన్ టైమ్ ఫర్ క్రిస్మస్, పాప్ కల్చర్ జెప్పడీ, అగ్ని, ది స్టిక్కీ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. జియో సినిమా ద్వారా భారీ యానిమేషన్ మూవీ క్రియేచ్ కమాండోస్, హాలీవుడ్ మూవీ లాంగింగ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ది ఒరిజినల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈవారంలో తెలుగు నుంచి అమరన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా డబ్బింగ్ మూవీనే అనే విషయం తెల్సిందే. పుష్ప 2 కారణంగా తెలుగు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ కూడా తగ్గి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఎప్పటిలాగే ఈ వారం సైతం థియేటర్, ఓటీటీ ద్వారా వినోదాల విందు పక్కా.