ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!
ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలవగా, మరికొన్ని ఈ వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
By: Tupaki Desk | 14 Feb 2025 2:47 PM GMTఈ వారం ఫిబ్రవరి 10 నుండి 16 వరకు పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలవగా, మరికొన్ని ఈ వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వివిధ భాషల్లో రకరకాల జానర్స్‌లో అందుబాటులోకి వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అందులో ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్ లో ‘ధూమ్ ధామ్’ (హిందీ, తెలుగు, తమిళం) అనే వినోదాత్మక ప్రేమకథతో పాటు, ‘ది విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్’ ( హిందీ) అనే యాక్షన్ సిరీస్ టాప్ లిస్ట్ లో ఉంది. ప్రేమకథలు ఇష్టపడేవారికి ‘హలో, లవ్, అగైన్’ (ఫిలిప్పినో) బెస్ట్ అప్షన్. ఇక ప్రైమ్ వీడియో లో స్పోర్డ్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘రియల్ మాడ్రిడ్: హౌ కుడ్ ఐ నాట్ లవ్ యూ’ (స్పానిష్) అనే డాక్యుమెంటరీతో పాటు, ‘మై ఫాల్ట్ లండన్’ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) అనే ప్రేమకథా చిత్రం అందుబాటులో ఉంది.
మరింత ఆసక్తికరంగా ‘టు లెట్’ (తమిళం) అనే కామెడీ-థ్రిల్లర్ కూడా ఈ వారం స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్ లో అయితే స్పెషల్ రియాల్టీ కథలు ఎక్కువగా సందడి చేయబోతున్నాయి. ‘ఇంగేజ్డ్ రోకా యా ధోకా’ (హిందీ), ‘గేమ్ ఆఫ్ గ్రీడ్’ (హిందీ), ‘లవ్ లైఫ్ లఫ్డే’ (హిందీ) వంటి షోలను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. హారర్ అభిమానుల కోసం ‘కుక్కూ’ (ఇంగ్లీష్) అనే హారర్ సినిమా కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ వారం స్ట్రీమింగ్ లో ఉన్న సినిమాలు – పూర్తి జాబితా:
మార్కో – సోనీ లివ్ | నీయో-నోయర్ యాక్షన్ థ్రిల్లర్ | మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ
మ్యాక్స్ – జీ5 | యాక్షన్ థ్రిల్లర్ | కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ
భైరతి రనగల్ – ఆహా వీడియో | నీయో-నోయర్ యాక్షన్ థ్రిల్లర్ | తెలుగు
మధురై పైయన్ చెన్నై పొన్ను (ఎస్సీ1) – ఆహా తమిళ్ | రొమాంటిక్ డ్రామా | తమిళం
కుక్కూ – జియో హాట్‌స్టార్ | హారర్ మిస్టరీ | ఇంగ్లీష్
బాబీ ఔర్ రిషి కి లవ్ స్టోరీ – జియో హాట్‌స్టార్ | రొమాంటిక్ డ్రామా | హిందీ
ఇంగేజ్డ్ రోకా యా ధోకా (ఎస్సీ1) – జియో హాట్‌స్టార్ | రియాలిటీ షో | హిందీ
హఫ్తా వసూలీ (ఎస్సీ1) – జియో హాట్‌స్టార్ | రియాలిటీ షో | హిందీ
గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఎస్సీ1) – జియో హాట్‌స్టార్ | రియాలిటీ షో | హిందీ
లవ్ లైఫ్ లఫ్డే (ఎస్సీ1) – జియో హాట్‌స్టార్ | రియాలిటీ షో | హిందీ
మై ఫాల్ట్ లండన్ – ప్రైమ్ వీడియో | రొమాంటిక్ డ్రామా | ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
టు లెట్ – ప్రైమ్ వీడియో | కామెడీ థ్రిల్లర్ | తమిళం
అపార్ట్‌మెంట్ 7ఏ – ప్రైమ్ వీడియో | సైకలాజికల్ హారర్ డ్రామా | ఇంగ్లీష్, హిందీ
ధూమ్ ధామ్ – నెట్‌ఫ్లిక్స్ | రోమ్-కామ్ | హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్
ది విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్ – నెట్‌ఫ్లిక్స్ | యాక్షన్ అడ్వెంచర్ | ఇంగ్లీష్, హిందీ
హలో, లవ్, అగైన్ – నెట్‌ఫ్లిక్స్ | రొమాంటిక్ డ్రామా | ఫిలిప్పినో
లా డోల్స్ విల్లా – నెట్‌ఫ్లిక్స్ | రోమ్-కామ్ | ఇంగ్లీష్, హిందీ
రియల్ మాడ్రిడ్: హౌ కుడ్ ఐ నాట్ లవ్ యూ (ఎస్సీ1) – ప్రైమ్ వీడియో | స్పోర్ట్స్ డాక్యుమెంటరీ | స్పానిష్
ప్యార్ కా ప్రొఫెసర్ (ఎస్సీ1) – ప్రైమ్ వీడియో | రొమాంటిక్ డ్రామా | హిందీ
గోల్డీ (ఎస్సీ1) – ఆపిల్ టీవీ ప్లస్ | యానిమేషన్ కామెడీ | ఇంగ్లీష్
మైన్ రాజ్ కపూర్ హో గయా – జీ5 | రొమాంటిక్ డ్రామా | హిందీ