ఓటీటీ డెంజర్ బెల్స్ మ్రోగిస్తున్నాయా?
ఓటీటీలో కూడా కంటెంట్ ఆదరణ తగ్గుంది అన్న కొత్త వాదన తెరపైకి వస్తుంది. ఓటీటీలకు ఆరంభంలో వచ్చిన సబ్ స్క్రిప్షన్స్ ఇప్పుడు రావడం లేదని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2023 12:30 AM GMTథియేట్రికల్ రిలీజ్ లేకపోతేనేం! ఎంచక్కా ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాం. మళ్లీ లాక్ డౌన్ వచ్చినా నో ప్రోబ్లాం..ఓటీటీ ఆప్షన్ ఉందిగా అనే ఓ ధీమా దర్శక-నిర్మాతల్లో ఉంది. థియేట్రికల్ రైట్స్ ఓటీటీకే ఇచ్చేసి ఎంచక్కా ప్రాపిట్ జేబులో వేసుకుంటాం? మాకేంటి నష్టం అన్న ధీమా చాలా మందిలో ఉంది. కానీ తాజాగా ఆ సినారేలో మార్పులొచ్చేలా కనిపిస్తున్నాయి. ఓటీటీ కూడా డెంజర్ బెల్స్ మ్రోగించడానికి రెడీ అవుతు న్నట్లు కనిపిస్తుంది.
ఓటీటీలో కూడా కంటెంట్ ఆదరణ తగ్గుంది అన్న కొత్త వాదన తెరపైకి వస్తుంది. ఓటీటీలకు ఆరంభంలో వచ్చిన సబ్ స్క్రిప్షన్స్ ఇప్పుడు రావడం లేదని అంటున్నారు. మార్కెట్ లో భారీ గా ఓటీటీల మధ్య పోటీ ఉండటం తో పాటు రకరకాల కారణాలు తెరపైకి వస్తున్నాయి. అవేంటంటే? హిట్ టాక్ వచ్చిన సినిమాని ప్రేక్షకుడు నేరుగా థియేటర్ కి వెళ్లి చూస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబంతో పాటు వెళ్లి ఆస్వాదిస్తున్నారు.
మళ్లీ అదే సినిమాని ఓటీటీలో రిలీజ్ అయినా చూసిన సినిమా చూసే పరిస్థితి కనిపించడం లేదు. చాలా వరకూ చూసిన సినిమాని మళ్లీ చూడటానికి చాలా మంది ఇష్టపడరు. ఆ రకంగా ఓటీటీలో రిపీటెడ్ ఆడియన్స్ తక్కువగా ఉంటారు. చూడని వారు ఓటీటీలో చూసే సంఖ్య తక్కువగానే ఉందంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ ..బాహుబలి లాంటి హిట్ సినిమాలు చాలా మంది థియేటర్లోనే చూసారు.
మళ్లీ వాటిని ఓటీటీలో వీక్షించింది చాలా తక్కువ. వాటి కన్నా కంటెంట్ ఉన్న సినిమాలు..థియేటర్లో రిలీజ్ కానీ కొత్త సినిమాలు ఓటీటీలో వీక్షిస్తున్నారు. ఆ రకంగా అది పాజిటివ్ సైన్ ఓటీటీకి. కానీ హిట్ కంటెంట్ దొరకడమే కష్టం. ఇక ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలు ఎలాగూ ఓటీటీలో చూడటం లేదు. చూసినా స్కిప్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు తప్ప మనసు పెట్టి చూస్తున్నట్లు కనిపించలేదు.
ఇది ఓటీటీకి అది పెద్ద డ్రా బ్యాక్ గా కనిపిస్తుందని పీడ్ బ్యాక్ వస్తుంది. సినిమాలు కొనుగోలు చేసి ఆదరణ లేకపోతే నష్టం తప్ప రూపాయి లాభం ఎక్కడ? అని ఆలోచిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో దక్కినంత ఆదరణ ఇప్పుడు ఓటీటీలకు దక్కడం లేదని అంటున్నారు. ఇదే కొనసాగితే మార్కెట్ పై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోట్ల రూపాయలు పోసి కంటెంట్ ని కొనడానికి కార్పోరేట్ దిగ్గజాలు ముందుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.