Begin typing your search above and press return to search.

అమెజాన్ ప్రైమ్‌లో మళ్లీ పుష్ప సందడి!

పుష్ప పార్ట్‌ 1 ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి పుష్ప ను అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 5:27 AM GMT
అమెజాన్ ప్రైమ్‌లో మళ్లీ పుష్ప సందడి!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్‌ 1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా చేసింది. ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇండియన్ సినీ చరిత్రలో ఇదే మొదటి సారి అనడంలో సందేహం లేదు. నాన్‌ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.450 కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

పుష్ప పార్ట్‌ 1 ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి పుష్ప ను అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. పుష్ప 2 సినిమా కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు.. అసలు పుష్ప పార్ట్‌ 1 లో ఏం ఉంది అంటూ గతంలో చూడని వారు ఇప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తూ ఉంటే, గతంలో చూసిన వారు మరోసారి పుష్ప 1ను చూడాలి అనే ఉద్దేశ్యంతో ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేస్తూ ఉన్నారు. ఓటీటీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈమధ్య కాలంలో పుష్ప పార్ట్‌ 1 కి అమెజాన్‌ ప్రైమ్‌లో వ్యూస్ భారీగా పెరిగాయి. పుష్ప 2 విడుదల అయిన తర్వాత ఇంకా పార్ట్‌ 1 స్ట్రీమింగ్‌ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో పుష్ప పార్ట్‌ 1 కి వస్తున్న ప్రస్తుత స్పందన చూసి అంతా షాక్‌ అవుతున్నారు. అమెజాన్‌ కి భలే లక్‌ కలిసి వచ్చిందని ఓటీటీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక పాత సినిమాను ఇంతగా చూడటం ఇదే అంటున్నారు. కొత్త సినిమాలకు సైతం ఓటీటీల పుష్ప 1 కి వచ్చిన వ్యూస్ దక్కడం లేదు. పుష్ప 2 విడుదల నేపథ్యంలో ఉన్న బజ్‌ నేపథ్యంలో అమెజాన్‌ లో పుష్ప 1ను చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. పైరసీ ని సైతం చాలా మంది చూస్తూ ఉన్నా పుష్ప 1 ను ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమాలో శ్రీలీల చేసిన కిస్సిక్‌ ఐటెం సాంగ్‌కి మంచి స్పందన దక్కింది. సినిమా విడుదలకు ముందే 100 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యింది. సినిమా విడుదలకు రెండు రోజులు ఉండగానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రీమియర్‌ షోల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు విపరీతంగా పెంచడంతో పుష్ప 2 సినిమాకు మొదటి రోజు రూ.300 కోట్లకు మించి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.