పుష్ప-2.. ఇప్పుడు కదా అసలైన కిక్కు!
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 Jan 2025 6:09 AM GMTసినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్.. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30వ తేదీన అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే పుష్ప రాజ్ ఓటీటీ హవా మొదలైందనే చెప్పాలి.
తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది పుష్ప-2. అంతేకాదు, సంక్రాంతి తర్వాత థియేటర్లో విడుదల చేసిన రీలోడెడ్ వెర్షన్ కన్నా ఎక్స్ ట్రా సీన్స్ తో ఓటీటీ వెర్షన్ ఉంది. ఈ విషయంలో మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొత్తం 3.44 గంటల నిడివితో విడుదలైంది ఓటీటీ వెర్షన్.
నిజానికి డిసెంబర్ 5వ తేదీన 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన పుష్ప-2 మూవీకి ఆ మధ్య మరో 20 నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు. దీంతో రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు చేరింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో మరో 4 నిమిషాలు యాడ్ చేయగా మొత్తం 3.44 గంటలతో రిలీజ్ అయ్యి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
అలా మొత్తం 23 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ చాలా బాగుందని నెటిజన్లు రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా విషయంలో వచ్చిన చిన్న డౌట్స్ కు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల మిస్ అయినట్లు అప్పుడు అనిపించిందని.. కానీ ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ తో కంప్లీట్ మూవీ చూసిన ఫీల్ ఉందని అంటున్నారు.
అది నిజమేనని చెప్పాలి. ఎందుకంటే పుష్పరాజ్- జపాన్ కనెక్షన్ గురించి ఓటీటీ వెర్షన్ లో క్లియర్ గా ఉంది. పుష్పరాజ్ జపాన్ ఎందుకు వెళ్లాడో అర్థమవుతోంది. జక్కా రెడ్డి చనిపోవడం, డబ్బులు తెచ్చుకోవడం, సిండికేట్ సభ్యులతో మీటింగ్ వంటి అనేక కొత్త సీన్స్ రీలోడెడ్ వెర్షన్ లో ఉన్నాయి. దీంతో ఓటీటీ వెర్షన్ తో అంతా ఫుల్ సేటిస్ఫైనట్లే.
అయితే 3.44 గంటల రన్ టైమ్ చాలా ఎక్కువని కొందరు అంటున్నారు. అంతటి నిడివితో థియేటర్లలో చూడడం కష్టం గానీ.. ఓటీటీలో చూడడం చాలా ఈజీ. ఎందుకంటే సినిమా ఎప్పుడు కావాలంటే అప్పుడు పాజ్ చేసి మళ్లీ ప్లే చేసి చూసుకోవచ్చు. కాబట్టి రన్ టైమ్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.