ఓటీటీలో నాలుగు రోజులకే పుష్ప2 రికార్డులు
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన పుష్ప2 ఓటీటీలో కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది.
By: Tupaki Desk | 5 Feb 2025 4:59 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా రిలీజై రెండు నెలలైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. బాహుబలి2 వసూళ్లను సైతం అధిగమించి పుష్పరాజ్ దూసుకెళ్లాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల కిందట ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన పుష్ప2 ఓటీటీలో కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. పుష్ప2ను స్ట్రీమింగ్ చేస్తున్న సందర్భంగా నెట్ ఫ్లిక్స్ తన అఫీషియల్ ఇన్‌స్టా అకౌంట్ బయోను కూడా మార్చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అని క్యాప్షన్ ఇవ్వగా, దీంతో పుష్ప రాజ్ నెట్ ఫ్లిక్స్ నే రూల్ చేస్తున్నాడని బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటిగా థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజైంది. తర్వాత మరో 25 నిమిషాల నిడివిని జోడించి మొత్తం 3 గంటల 46 నిమిషాల నిడివితో పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ అని రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసింది కూడా ఆ రీలోడెడ్ వెర్షనే. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప2 నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.
ఈ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ను కూడా ఆశ్చర్యపరుస్తూ, ఏడు దేశాల్లో నెం.1 స్థానంలో దూసుకెళ్తుంది. గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో పుష్ప2 నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో ఉండి, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. సుకుమార్ గ్రిప్పింగ్ కథనం, యాక్షన్ సీక్వెన్స్ ల వల్లే ఈ రేంజ్ లో వ్యూస్ పెరుగుతున్నాయని అంతా భావిస్తున్నారు.
నాలుగు రోజులకే పుష్ప రాజ్ రూల్ ఈ రేంజ్ లో ఉంటే మరో వారానికి ఇంకా ఏయే రికార్డులను బ్రేక్ చేస్తాడో అని అంతా భావిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించగా, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.