Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌లోనే కాదు OTTలోను నిరాశే

27 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు (గోద్రా రైలు) దహనం సంఘటన ఆధారంగా రూపొందింది. ఇందులో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా త‌దిత‌రులు నటించారు.

By:  Tupaki Desk   |   13 Jan 2025 8:30 AM GMT
థియేట‌ర్ల‌లోనే కాదు OTTలోను నిరాశే
X

విడుద‌ల‌కు ముందు చాలా కాలం పాటు చ‌ర్చ‌ల్లో నిలిచిన చిత్రం `స‌బ‌ర్మ‌తి రిపోర్ట్`. గోద్రా అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ పొలిటిక‌ల్ డ్రామా రంజన్ చందేల్ దర్శకత్వంతో రూపొంద‌గా, అసీమ్ అరోరా, అవినాష్, అర్జున్ క‌థ రాశారు. తరువాత ధీరజ్ సర్నా కూడా ఈ టీమ్ తో చేరారు. ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్ -వికీర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించగా, జీ స్టూడియోస్ పంపిణీ చేసింది.

27 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు (గోద్రా రైలు) దహనం సంఘటన ఆధారంగా రూపొందింది. ఇందులో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా త‌దిత‌రులు నటించారు. చాలా సమస్యలు ఎదుర్కొని ర‌క‌ర‌కాల‌ జాప్యాల తర్వాత `ది సబర్మతి రిపోర్ట్` 15 నవంబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. ఇది విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ ఫ్లాప్ గా మారింది. దాదాపు 50 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంది కేవ‌లం 30 కోట్లు మాత్ర‌మే థియేట‌ర్ల నుంచి రాబ‌ట్టింది.

మేకింగ్ ప‌రంగా చాలా విష‌యాల్లో ఫెయిల‌వ్వడం వ‌ల్ల‌నే స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ ఓటీటీలోను బిగ్ ఫ్లాపైంది. 2002 గోద్రా రైలు దుర్ఘ‌ట‌న‌లో వాస్త‌వాల‌ను చిత్రీక‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని, ఇందులో భావోద్వేగాలు లేవ‌ని, వ‌న్ సైడెడ్ గా చిత్రీక‌రించార‌ని ర‌క‌ర‌కాలుగా క్రిటిక్స్ విమ‌ర్శించారు. నెటిజ‌నులు కూడా ఇవే విష‌యాల‌ను ప్ర‌స్థావిస్తూ విమ‌ర్శించారు. విక్రాంత్ మాస్సే మంచి నటనను ప్రదర్శించినా కానీ ఈ సినిమాకి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆశించిన స్క్రీన్ ప్లే, లాజిక్కులు కూడా ఇందులో లేవు. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ త‌ర‌హాలో ఇదీ సింపుల్ గా ఉంది. క‌మ‌ర్షియ‌ల్ గా సినిమాటిక్ బ్రిలియ‌న్సీ ఇందులో స‌న్నివేశాల్లో క‌నిపించదు. సినిమా ఒక ఫ్లోలో సాగ‌దు. ఎడిటింగ్ విభాగం స‌హా సాంకేతికంగాను అంత‌గా వ‌ర్క‌వుట్ కాని సినిమా ఇది అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

`సబర్మతి రిపోర్ట్` థియేట‌ర్ లో లానే ఓటీటీలోను నిరాశపరిచింది. ఒక సాధార‌ణ చిత్రం కంటే త‌క్కువ స్థాయిలో ఈ సినిమా ని తెర‌కెక్కించార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చాలా సినిమాలు థియేట‌ర్ల‌లో ఫ్లాపై ఓటీటీల్లో మెప్పిస్తున్నాయి. అందుకు భిన్నంగా స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ అన్ని విధాలుగాను నిరాశ‌ప‌రిచిందని విశ్లేష‌కులు చెబుతున్నారు.