సలార్ ఓటీటీ ట్విస్ట్.. ఓ రోజు ముందుగానే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం సలార్
By: Tupaki Desk | 19 Jan 2024 5:03 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం సలార్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 715 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సలార్ తో ప్రభాస్ అందుకున్నారు. డార్లింగ్ అభిమానులని కూడా సలార్ మూవీ బాగా ఇంప్రెస్ చేసింది.
ఈ సినిమాకి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం తెరకెక్కించే పనిలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. దానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఇదిలా ఉంటే సలార్ ఓటీటీ రిలీజ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాగా ఇంకా నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలో విడుదలకి సిద్ధం చేశారు.
నిజానికి జనవరి 20న సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే ఆ డేట్ కి ఒక రోజు ముందుగా జనవరి 19 అర్ధ రాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా కన్ఫామ్ చేసింది. థియేటర్స్ లో గత ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచిన సలార్ ని ఓటీటీలో కూడా మరోసారి చూడటానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
మూవీలో బలమైన ఎమోషన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ ఉండటంతో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ ఎక్కువగా టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలని భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఈ సినిమాల ద్వారా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నారు.
ఇప్పుడు ప్రపంచంలో ఓటీటీ ఛానల్స్ కి ఇండియా అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ గా ఉంది. అందుకే ఎన్ని కోట్లయిన ఖర్చు పెట్టి స్టార్ హీరోల చిత్రాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ తీసుకుంటున్నారు. ఈ కోవలోనే సలార్ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 162 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాతో నెట్ ఫ్లిక్స్ కి ఏ మాత్రం ఆదాయం వస్తుందనేది చూడాలి.