ఐదేళ్ల తర్వాత 'షకీలా' ఓటీటీలో..!
మలయాళంలోనే కాకుండా అన్ని సౌత్ భాషల్లోనూ ఒకప్పుడు స్టార్‌గా వెలుగు వెలిన నటి షకీలా. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్ సినిమాలతో షకీలా సినిమాలు పోటీ పడేవి.
By: Tupaki Desk | 27 Feb 2025 4:45 PM ISTమలయాళంలోనే కాకుండా అన్ని సౌత్ భాషల్లోనూ ఒకప్పుడు స్టార్‌గా వెలుగు వెలిన నటి షకీలా. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్ సినిమాలతో షకీలా సినిమాలు పోటీ పడేవి. పలు సార్లు షకీలా సినిమాల ముందు పెద్ద హీరోల సినిమాలు ఢీలా పడ్డ సందర్భాలు ఉన్నాయని అంటారు. అలాంటి షకీలా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన షకీలా బయోపిక్ మూవీ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ఈమధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ షకీలా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి మాత్రం ఇన్నాళ్ల సమయం పట్టింది.
కొన్ని కారణాల వల్ల 'షకీలా' విడుదలై ఇన్నేళ్లు అయినా అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కి నోచుకోలేదు. యూట్యూబ్‌లో ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై షకీలా సినిమా పైరసీ స్ట్రీమింగ్ అవుతుంది. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో షకీలా సినిమాను అధికారికంగా స్ట్రీమింగ్ చేశారు. మొదటగా షకీలా హిందీ వర్షన్‌ను అమెజాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఓటీటీ ప్లే యాప్‌లోనూ షకీలా సినిమాను చూసే విధంగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయాలని కొందరు కోరుకుంటున్నారు. అతి త్వరలోనే అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
షకీలా సినిమాలో టైటిల్ రోల్‌ను రిచా చద్దా పోషించింది. బాలీవుడ్‌లో రూపొందిన ఈ సినిమా 202 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా థియేటర్‌లో ఆడలేదు. పైగా సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్ అయింది. యూట్యూబ్‌తో పాటు అన్ని చోట్ల షకీలా సినిమా పైరసీ అయింది. దాంతో సినిమాకు రావాల్సిన వసూళ్లు రాలేదు. పైగా ఓటీటీ స్ట్రీమింగ్ బిజినెస్ సైతం ఆశించిన స్థాయిలో కాలేదనే టాక్ వచ్చింది. అందుకే ఇన్ని రోజులు ఓటీటీలో షకీలా సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు అనే అభిప్రాయం సైతం ఉంది.
ఎట్టకేలకు హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న షకీలాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన దక్కుతుంది. థియేట్రికల్ రిలీజ్ మిస్ అయిన ప్రేక్షకులు చాలా మంది ఓటీటీలో షకీలాను చూస్తున్నారు. సౌత్ భాషల్లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో మరింతగా సినిమాకు ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. షకీలా జీవిత చరిత్రను ఒక శృంగార సినిమాలా కాకుండా భావోద్వేగాలతో కూడిన సినిమాగా దర్శకుడు ఇంద్రజీత్ లంకేష్ రూపొందించారు. ఈ సినిమాలో రిచా చద్దా ముఖ్య పాత్రలో నటించగా పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై, ఎస్తేర్ నోరాన్హా, శివరానా, కాజోల్ చుగ్, సందీప్ మలని ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ వివాదాస్పద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది అనడంలో సందేహం లేదు.