Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటిటి లో ఇన్ని రిలీజులు ఉన్నాయా

ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా ఎనిమిది సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:16 AM GMT
ఈ వారం ఓటిటి లో ఇన్ని రిలీజులు ఉన్నాయా
X

ప్రతివారం లాగానే ఈ వారం కూడా.. చాలానే ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ గా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా ఎనిమిది సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల అవుతున్నాయి. అసలు ఈ సినిమాలు ఏంటి.. ఏయే ప్లాట్‌ఫారమ్‌లలో చూడవచ్చో వివరాలను ఒకసారి చూద్దాం.

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం:

రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆహా వీడియోలో ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

తిరగబడరా సామి:

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఆహా వీడియోలో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. బోలెడు వివాదాల మధ్య విడుదల అయినా కూడా బాగానే రెస్పాన్స్ అందుకుంటోంది.

సురాపానం:

అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సినిమా ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది.

సోపాతులు:

అనంత్ వర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా కూడా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోంది.

పేకమేడలు:

నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ది మిస్టరీ ఆఫ్ మోక్షా ఐలాండ్:

ఈ తెలుగు థ్రిల్లర్, మిస్టరీ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్లో అందుబాటులో ఉంది.

బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్:

మలయాళం నుండి తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 23, ఆదివారం నుండి డిస్నీ+ హాట్‌స్టార్లో అందుబాటులోకి రానుంది.

ఫాస్ట్ X:

ఇంగ్లీష్ నుండి తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుత్తోంది.

పెంగ్విన్:

ఇంగ్లీష్ నుండి తెలుగులోకి డబ్ చేసిన ఈ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ జియో సినిమాలో అందుబాటులో ఉంది.

సరిపోదా శనివారం:

దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత.. నాని ఈ మధ్యనే సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నారు. 100 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యింది.