మల్టీస్టారర్ స్పోర్ట్స్ డ్రామా వచ్చేసింది చూశారా..!
తాజాగా తమిళ్‌లో సీనియర్ స్టార్ హీరోలు మాధవన్, సిద్దార్థ్‌లు కలిసి నటించిన 'టెస్ట్' పై అందరి దృష్టి ఉంది.
By: Tupaki Desk | 4 April 2025 9:55 AMభాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. స్క్రీన్ పై ఒక్క హీరోను లేదా హీరోయిన్‌ను చూస్తేనే ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. అందుకే అన్ని భాషల్లోనూ మల్టీ స్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. హీరోల స్టార్‌డం, క్రేజ్‌ను బట్టి ఆయా మల్టీస్టారర్ సినిమాల క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ్‌లో సీనియర్ స్టార్ హీరోలు మాధవన్, సిద్దార్థ్‌లు కలిసి నటించిన 'టెస్ట్' పై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నయనతార, మీరా జాస్మిన్ నటించడం విశేషం. ఈ అరుదైన కలయికలో రూపొందిన 'టెస్ట్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఎస్ శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచి తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి నెలకొంది. సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఈ భారీ మల్టీస్టారర్ స్పోర్ట్స్ డ్రామాను స్ట్రీమింగ్ చేసింది. సినిమాలో క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలు క్రికెట్ అభిమానులను అలరిస్తాయని రివ్యూలు వస్తున్నాయి. నయనతార నటించిన సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఓటీటీ ముందు క్యూ కట్టారు.
చెన్నైలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది, ఆ ఆటకి ఆ ముగ్గురికి సంబంధం ఏంటి అనే విషయాలను ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో దర్శకుడు శశికాంత్ నడిపిన తీరు బాగుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న నయనతార ఈ సినిమాలో నటించడంతో పాటు మాధవన్, సిద్దార్థ్ వంటి ఒకప్పటి స్టార్స్ నటించడంతో టెస్ట్ సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు.
వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించిన ఈ సినిమాలో నాజర్, కాళి వెంకట్, వినయ్ వర్మలు కీలక పాత్రలో నటించారు. శక్తి శ్రీ గోపాలన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. నయనతార గతంలో నటించిన కొన్ని సినిమాలు కూడా థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసుకుని డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు సెంటిమెంట్ వర్కౌట్ అయి మంచి స్పందన వస్తుందని అంతా భావించారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ మల్టీస్టారర్ స్పోర్ట్స్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌లో మీరు చూశారా? లేదా చూడబోతున్నారా?