Begin typing your search above and press return to search.

ఓటీటీ : 10 నెలల ఎదురుచూపులకు తెర..!

2023 మే 5న ప్రేక్షకుల ముందుకు ఒక చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరీ వివాదాల కారణంగా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:09 AM GMT
ఓటీటీ : 10 నెలల ఎదురుచూపులకు తెర..!
X

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ, హిందీ ఇతర భాషల సినీ ప్రేమికులు గత 10 నెలలుగా అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. 2023 మే 5న ప్రేక్షకుల ముందుకు ఒక చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరీ వివాదాల కారణంగా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక మతం వారిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా ఈ సినిమా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. కొన్ని దేశాల్లో ఈ సినిమాను బ్యాన్‌ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. థియేటర్ లో దాదాపుగా రెండు నెలల పాటు సందడి చేసిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

థియేటర్‌ లో ఈ సినిమాను చూడలేక పోయిన వారు అప్పటి నుంచి కూడా ఓటీటీ లో ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామా అన్నట్లుగా వెయిట్‌ చేస్తున్నారు. పది నెలలు అయినా కూడా ఇంకా కూడా సినిమా స్ట్రీమింగ్‌ అవ్వక పోవడంతో ఇక రాదేమో అనుకున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమాను జీ 5 లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. గత అర్థ రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న వారు ఈ సినిమాను వెంటనే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. జీ5 లో పెద్ద ఎత్తున ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్‌ షా నిర్మించిన ఈ హిందీ సినిమాలో అదా శర్మ కీలక పాత్రలో కనిపించింది. ఇంకా యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ఇంకా ముఖ్యలు నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మార్చి వారితో ఉగ్రవాద కార్యక్రమాలు చేయించే కథతో ఈ సినిమా రూపొందింది. మీరు థియేటర్ లో చూడకుంటే మంచి రివ్యూలు వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.