ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
మార్చి నెల సాధారణంగా బిజీ సీజన్ కాకపోవడంతో, పలు భిన్నమైన కథలతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 10:26 PM ISTఈ వారం సినిమా ప్రేమికుల కోసం ఓటీటీ, థియేటర్లలో పలు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశంగా మారింది. మార్చి నెల సాధారణంగా బిజీ సీజన్ కాకపోవడంతో, పలు భిన్నమైన కథలతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో చావా, కింగ్స్టన్, ఆఫీసర్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, ఓటీటీలో తండేల్, ధూమ్ ధామ్, పట్టుదల వంటి సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
మార్చి 7వ తేదీన థియేటర్ ప్రేక్షకుల కోసం భారీ లైనప్ కనిపిస్తున్నప్పటికీ, అందులో వాస్తవంగా ఏ సినిమా హిట్ అవుతుందనే విషయం మాత్రం ప్రేక్షకుల రివ్యూలపై ఆధారపడి ఉంటుంది. కేవలం సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మాత్రమే రీ రిలీజ్ అవుతున్నప్పటికి బుకింగ్స్ లో హవా చూపిస్తోంది. మరోవైపు ఓటీటీ వేదికలపై వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా మంచి అంచనాలు ఏర్పరచుకున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాయో చూడాలి. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఇవే.
థియేటర్లలో మార్చి 7న విడుదలకానున్న సినిమాలు:
ఛావా (Chhaava) (తెలుగు వెర్షన్)
కింగ్స్టన్
రాక్షస
రా రాజా
నారి
వైఫ్ ఆఫ్ అనిర్వేష్
పౌరుషం
నీరుకుళ్ల
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (రీ-రిలీజ్)
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్‌లు:
నెట్‌ఫ్లిక్స్
తండేల్ – మార్చి 7
పట్టుదల – స్ట్రీమింగ్
విత్ లవ్ మేఘన్ (వెబ్ సిరీస్) – మార్చి 4
నదానియాన్ (హిందీ) – మార్చి 7
ఈటీవీ విన్
ధూమ్ ధామ్ (తెలుగు) – మార్చి 6
సోనీ లివ్
రేఖా చిత్రం (తెలుగు) – మార్చి 7
అమెజాన్ ప్రైమ్ వీడియో
దుపహియా (హిందీ) – మార్చి 8
జీ5
కుటుంబస్థాన్ – మార్చి 7
జియో సినిమా/హాట్‌స్టార్
బాపు (Baapu) – మార్చి 7
డేర్ డెవిల్ (వెబ్ సిరీస్) – మార్చి 4
ఈ వారం మొత్తం 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. కొన్ని ఇదివరకే విడుదల కాగా మరికొన్ని శుక్రవారం . థియేటర్లలో ఏ సినిమాలు విజయం సాధిస్తాయో, ఓటీటీలో ఏవి టాప్ టెండింగ్‌లో నిలుస్తాయో చూడాలి.