Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ సినిమాలు ఇవే

గత వారం ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా పుష్ప 2 మాత్రమే వచ్చింది. ఆ సినిమా జోరు జాతర ముందు నిలవడం మరే సినిమాకు సాధ్యం కాదు. కనుక పుష్ప 2 తో మరే సినిమా విడుదల కాలేదు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 9:50 AM GMT
ఈవారం ఓటీటీ సినిమాలు ఇవే
X

గత వారం ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా పుష్ప 2 మాత్రమే వచ్చింది. ఆ సినిమా జోరు జాతర ముందు నిలవడం మరే సినిమాకు సాధ్యం కాదు. కనుక పుష్ప 2 తో మరే సినిమా విడుదల కాలేదు. అయితే ఈ వారం ఫియర్‌, మిస్‌ యూ, పని, ప్రణయ గోదావరి సినిమాలు థియేటర్ ద్వారా రాబోతున్నాయి. డైరెక్ట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఈవారం ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఓటీటీ ద్వారా సినిమాలు, సిరీస్‌లు, షోలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు ఓటీటీలు రెడీగా ఉన్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌లో ఈవారం.. మిస్‌ మ్యాచ్డ్‌ సీజన్ 3 అనే హిందీ సిరీస్‌, 1992 స్పానిష్ సిరీస్‌, క్యారీఆన్ ఇంగ్లీష్ మూవీ, డిజాస్టర్‌ హాలీడే ఇంగ్లీష్ మూవీ, ట్యాలెంట్‌ లెస్ టకానో జపనీస్ సిరీస్‌, లా పల్మా నార్వేజియన్‌ సిరీస్‌, నో గుడ్‌ డీడ్ ఇంగ్లీష్ సిరీస్‌లను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ప్రతి వారం తెలుగు ప్రేక్షకుల కోసం ఏదో ఒక సినిమాను స్ట్రీమింగ్‌ చేసే నెట్‌ ఫ్లిప్స్ ఈవారం తెలుగు కంటెంట్‌తో రావడం లేదు. దాంతో తెలుగు నెట్‌ ఫ్లిప్స్ ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

అమెజాన్‌ ప్రైమ్‌లో ఈవారం తెలుగు సినిమా మెకానిక్ రాకీ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. విశ్వక్‌ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు కలిగే విధంగా ప్రమోషన్ చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దాంతో మూడు వారాలు పూర్తి కాకుండానే ఓటీటీ ద్వారా రాబోతుంది. ఇంకా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా.. బండిష్ బండిట్స్‌ సీజన్‌ 2 హిందీ సిరీస్, బాలీవుడ్‌ మూవీ సింగం అగైన్‌, కథ ఇన్నువరె మలయాళ మూవీ, రెడ్‌ వన్‌ తెలుగు డబ్బింగ్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి.

హాట్‌స్టార్‌లో తెలుగు సిరీస్ హరికథ, ఎల్టన్‌ జాన్‌ ఇంగ్లీష్ మూవీ, ఇన్విజబుల్‌ స్పానిష్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఆహా లో వేరే లెవల్‌ ఆఫీస్ తెలుగు సిరీస్ స్ట్రీమింగ్‌ కాబోతుంది. మొత్తానికి ఈ వారం సైతం చాలా సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్‌ల ద్వారా రావడం లేదు కనుక ఈ వారం ఈ సినిమాలు, సిరీస్‌లతో వీకెండ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2 సినిమా జోరు ఈ వీకెండ్‌లోనూ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.