ఈ వారం 'పుష్ప 2' తో పాటు ఇవి కూడా..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 5 Dec 2024 9:27 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో, విపరీతమైన క్రేజ్‌తో రూపొందిన సినిమా కావడంతో తెలుగులోనే కాకుండా మరే భాషలోనూ ఈ సినిమాకి పోటీగా సినిమాలు రాలేదు. ముందు వారం తర్వాత వారం కూడా పుష్ప 2 కి పోటీ అనేది లేకుండా పోయింది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు పెట్టింది. ఈ వీకెండ్ థియేటర్ వినోదాన్ని కోరుకునే వారు పుష్ప 2 కి టికెట్లు బుక్ చేసుకుంటూ ఓటీటీ వినోదాన్ని కోరుకునే వారి కోసం ఈవారం కూడా చాలా కంటెంట్ వచ్చింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన తమిళ్ మూవీ అమరన్‌ను ఈ వారం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసింది. ఇప్పటికే అమరన్ సినిమా వచ్చేసింది. శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొంది. దాదాపుగా రూ.325 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న అమరన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అమరన్ వచ్చేసింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు అమరన్‌తో పాటు వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన 'మట్కా' సినిమాను సైతం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. థియేటర్ రిలీజ్ అయిన మూడు వారాలకే మట్కా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది.
ఇవే కాకుండా ఇంగ్లీష్, హిందీ సినిమాలు సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ద్వారా చాలానే వచ్చాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికే చర్చిల్ ఎట్ వార్, దట్ క్రిస్మస్, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా, ది అల్టిమేటమ్, బ్లాక్ డవ్జ్, ఎ నాన్సెన్స్ క్రిస్మస్, బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్, జిగ్రా, మేరీ, విక్కీ విద్యా కా వో వాలా వీడియో లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక అమెజాన్ లో జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్, పాప్ కల్చర్ జెప్పడీ, అగ్ని, ది స్టిక్కీ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వీకెండ్‌కి ఓటీటీ ప్రేక్షకుల కోసం అన్ని ఓటీటీలు కలిపి 50 సినిమాలు, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేశాయి, మరికొన్ని నేడు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఈవారం పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం కన్ఫర్మ్. మొదటి రోజు పుష్ప 2 సినిమా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. శని, ఆదివారాల్లోనూ సినిమా ఓ రేంజ్ వసూళ్లు సొంతం చేసుకుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఇప్పటి నుంచే పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ ముందుకు వచ్చే అవకాశాలు లేవని అంతా అంటున్నారు.