బడా సినిమాలన్నీ ఆ ఓటీటీ దిగ్గజానికే..
ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 1 May 2024 4:14 AM GMTడిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న అంతర్జాతీయ కంపెనీ నెట్ ఫ్లిక్స్. ఇండియాలో పబ్లిక్ ఎక్కువగా ఆసక్తి చూపించే వాటిలో సినిమా ఎంటర్టైన్మెంట్ టాప్ లో ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఇండియన్ సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెడుతోంది.
ఇతర స్ట్రీమింగ్ ఛానల్స్ తో పోటీ పడుతూ వారికంటే ఎక్కువ ధరని నిర్మాతలకి ఆఫర్ చేస్తూ డిజిటల్ హక్కులు దక్కించుకుంటుంది. టాలీవుడ్ లో టైర్ 1, టైర్ 2 హీరోల చిత్రాల డిజిటల్ రైట్స్ మేగ్జిమమ్ నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్తున్నాయి. ఈ ఏడాదిలో రిలీజ్ కాబోయే సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఆయా సినిమాలకి ఉన్న డిమాండ్ బట్టి నెట్ ఫ్లిక్స్ రైట్స్ కోసం పెట్టుబడిలు పెడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా డిజిటల్ రైట్స్ ని 275 కోట్లని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇండియా బాక్సాఫీస్ పై ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిజిటల్ రైట్స్ డీల్ కావడం విశేషం. పుష్ప ది రూల్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర డిజిటల్ రైట్స్ ని ఏకంగా 155 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందంట. ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది అతిపెద్ద డిజిటల్ డీల్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 16 కోట్లకి ఈ మూవీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్.
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డిజిటల్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధర ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కచ్చితమైన ధర ఎంతనేది తెలియలేదు. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి 40 కోట్లు నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందని సమాచారం. ఈ సినిమాల డిజిటల్ రైట్స్ డీల్స్ థియేట్రికల్ డీల్స్ కంటే ముందే క్లోజ్ అయ్యాయి.