టచ్ మీ నాట్ ఎలా ఉంది..?
ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలుగులో వచ్చిన వెబ్ సీరీస్ టచ్ మీ నాట్. నవదీప్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ఈ సీరీస్ను రమణ తేజ డైరెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 5 April 2025 1:28 PMఆసక్తికరమైన కథ కథనాలు ఉన్న వెబ్ సీరీస్ లకు ప్రేక్షకులు తమ ఆమోద ముద్ర వేస్తారు. అందుకే ప్రతి వారాంతరం థియేటర్ లో సినిమాలు ఎలా రిలీజ్ కామనో ప్రతి వీకెండ్ ఓటీటీల్లో సీరీస్ లు కూడా అంతే కామన్ అయ్యాయి. వీకెండ్ సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేలా వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలుగులో వచ్చిన వెబ్ సీరీస్ టచ్ మీ నాట్. నవదీప్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ఈ సీరీస్ను రమణ తేజ డైరెక్ట్ చేశారు. ఈ సీరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంతకీ అసలు ఏంటి ఈ టచ్ మీ నాట్ కథ అంటే.. 2009 లో దీపావళి పండుగ హడావిడి టైం లో మారుతి అపార్టుమెంట్ లో నలుగురు మహిళలు హత్యకు గురవుతారు. ఆ తర్వాత హత్య చేసిన వ్యక్తి గ్యాస్ లీక్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ ఇన్సిడెంట్ లో రాఘవ (నవదీప్) తల్లిని కోల్పోగ రిషి (దీక్షిత్ శెట్టి) తల్లిదండ్రులకి దూరమవుతాడు.
పదేళ్ల తర్వాత రాఘవ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వగా.. రిషిని కూడా అతనే చూసుకుంటాడు. రిషికి గతంలో గాయం వల్ల సైకో మెట్రి పవర్ వస్తుంది. అంటే వస్తువులు, మనుషులను టచ్ చేస్తే వాటి వివరాలు అన్నీ చెప్పగలుగుతాడు. ఈ టైం లోనే రిషికి మేఘ (కోమలి ప్రసాద్) పరిచయం అవుతుంది. ఆమె కూడా మారుతి అపార్టుమెంట్ బాధితురాలే అని తెలుస్తుంది. మరోపక్క రాఘవను అతనితో పనిచేసే దేవిక (సంచిత పూనాచ) ఇష్టపడుతుంది. ఐతే ఒక హాస్పిటల్ లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల 20 మంది పేషెంట్స్ చనిపోతారు. దాని వల్ల మరోసారి మారుతి అపార్టుమెంట్ కేసు తెర మీదకు వస్తుంది. ఐతే ఆ కేసుతో దీన్ని పోల్చుతూ రిషి సైకో మెట్రి శక్తితో వివరాలు తెలుసుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వెబ్ సీరీస్ కథ.
ఈ వెబ్ సీరీస్ కొరియన్ సీరీస్ హీ ఈజ్ సైకో మెట్రిక్ ఆధారంగా తెరకెక్కించారు. ఐతే కథ సైకో మెట్రి మీద డిపెండ్ అవ్వగా దాన్ని పూర్తిస్థాయిలో చూపించలేకపోయారు. కథ బాగున్నా కథనం చాలా ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా టచ్ మీ నాట్ సీజన్ 2 ఆసక్తి కలిగించేలా ఉండేందుకు మొదటి సీజన్ లో అన్ని అలా పై పైన లాగించినట్టు ఉంది. టచ్ మీ నాట్ మొదటి సీజన్ 6 ఎపిసోడ్స్ తో వచ్చింది. తెలుగుతో పాటు మిగతా 6 భాషల్లో ఈ వెబ్ సీరీస్ రిలీజైంది. సీరీస్ మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా ఎపిసోడ్స్ నడుస్తున్నా కొద్దీ బోర్ ఫీలింగ్ వస్తుంది.