Begin typing your search above and press return to search.

రేపే విడుదల.. 'ఆహా'లో సూపర్‌ హిట్‌ మూవీ

2024 డిసెంబర్‌ 20న క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మార్కో'. మలయాళంలో రూపొందిన మార్కో సినిమాకు హిట్‌ టాక్ రావడంతో రెండు వారాలు తిరగక ముందే ఇతర భాషల్లోనూ డబ్‌ చేసి విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 6:54 AM GMT
రేపే విడుదల.. ఆహాలో సూపర్‌ హిట్‌ మూవీ
X

2024 డిసెంబర్‌ 20న క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మార్కో'. మలయాళంలో రూపొందిన మార్కో సినిమాకు హిట్‌ టాక్ రావడంతో రెండు వారాలు తిరగక ముందే ఇతర భాషల్లోనూ డబ్‌ చేసి విడుదల చేశారు. తెలుగులో 2025 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హనీఫ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ 'మార్కో' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసింది. ఏ సర్టిఫికెట్‌ వచ్చిన మలయాళ సినిమా వంద కోట్లు, అంతకు మించి వసూళ్లను సొంతం చేసుకోవడం చరిత్రలో ఎప్పుడూ లేదు. మార్కో సినిమాతో ఉన్ని ముకుందన్ ఆ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.


తెలుగులో ఉన్ని ముకుందన్ నటించిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. దాంతో మార్కో సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రిలీజ్ మిస్ అయిన వారు ఓటీటీ ద్వారా మార్కోను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తెలుగులో మార్కో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆహా గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉన్ని ముకుందన్‌ ముఖ్య పాత్రలో నటించిన మార్కో సినిమాను ఆహా ఓటీటీ ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. మార్కో సినిమా తెలుగు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

సిద్దిక్‌, జగదీష్, అభిమన్యు, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, అన్సల్‌ పాల్‌, యుక్తి తారేజా ముఖ్య పాత్రల్లో నటించిన మార్కో సినిమాలో హింస మరీ ఎక్కువ అయిందనే విమర్శలు వచ్చాయి. అవే సన్నివేశాలు యాక్షన్‌ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్‌కి రప్పించాయని మలయాళ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. రవి బస్రూర్‌ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌తో దుమ్ము రేపాడు. అద్భుతమైన రవి బస్రూర్ సంగీతం సినిమా స్థాయిని అమాంతం లేపింది. యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మలయాళ సినీ చరిత్రలో మార్కో నిలిచి పోయే మూవీ అనడంలో సందేహం లేదు.

మార్కో వంటి భారీ యాక్షన్ మూవీని తెలుగులో చూడటం కోసం వెయిట్‌ చేస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఆహా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సోనీ లివ్‌ లో సినిమా మలయాళ వర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు వర్షన్‌ను మాత్రం ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయనుంది. నేడు అర్థ రాత్రి నుంచి మార్కో తెలుగులో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి చంద్రు సెల్వరాజ్‌ అందించిన సినిమాటోగ్రఫీ సైతం ఆకట్టుకుంది. 2024లో మలయాళ సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సక్సెస్‌ సినిమాల్లో మార్కో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో ఉన్ని ముకుందన్‌ స్థాయి, క్రేజ్ మరింతగా పెరిగాయి. ముందు ముందు ఉన్ని ముకుందన్‌ నుంచి భారీ బడ్జెట్‌ సినిమాలు రావడానికి మర్కో కారణం కానుంది.