పని చేయని ఆలియా ఫ్యాక్టర్ ట్రిప్తి ఫ్యాక్టర్
పరిశ్రమలో అగ్ర కథానాయికగా హవా సాగిస్తోంది ఆలియా భట్. తాను నటించిన `జిగ్రా` ఇటీవలే థియేట్రికల్ గా విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Dec 2024 6:45 PM GMTపరిశ్రమలో అగ్ర కథానాయికగా హవా సాగిస్తోంది ఆలియా భట్. తాను నటించిన `జిగ్రా` ఇటీవలే థియేట్రికల్ గా విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, జైల్ బ్రేక్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమాకి వసంత్ బాలా దర్శకత్వం వహించగా ప్రేక్షకులు తిరస్కరించారు. ఇప్పుడు ఓటీటీలోను అదే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద తెర - ఓటీటీ తెర రెండుచోట్లా ఈ చిత్రం నిరాదరణకు గురైంది.
ఇక జిగ్రాతో పాటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న `విక్కీ విద్యా క వో వాలా` పరిస్థితి అందుకు భిన్నంగా లేదని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు యాధృచ్ఛికంగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాయి. కానీ ఇవి ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. `విక్కీ విద్యా క వో వోలా వీడియో` చిత్రంలో ట్రిప్తి దిమ్రీ గ్లామరస్ యాక్ట్ కూడా దీనిని కనీస మాత్రంగా కాపాడలేకపోయింది. డ్రీమ్ గర్ల్ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ఆకట్టుకున్న రాజ్ శాండిల్య ఆశించిన విజయం అందుకోలేకపోయాడు.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఓటీటీ ఆడియెన్ నుంచి కూడా ప్రతికూల స్పందనలు అందుకుంది. అడల్ట్ కామెడీ కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్టవ్వగా, ఫ్యామిలీ ఆడియెన్ కి విసుగొచ్చిందన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా ట్రిప్తి దిమ్రీ గ్లామర్ ఎలివేషన్ .. డ్యాన్సులు కూడా ఆశించిన స్థాయిలో ఆడియెన్ కి కనెక్ట్ కాకపోవడం కూడా ఈ ఫ్లాప్ కి కారణమని చెబుతున్నారు. విక్కీ వోలా.. చిత్రంలో రాజ్ కుమార్ రావు లాంటి సీనియర్ నటుడు నటించినా కానీ, ఎందుకనో ఆశించిన ఫలితం దక్కలేదు. జిగ్రాను ఆలియా ఫ్యాక్టర్.. విక్కీ వోలాను ట్రిప్తి ఫ్యాక్టర్ కాపాడలేకపోయాయని దీనిని బట్టి అంగీకరించాలి.