Begin typing your search above and press return to search.

విశ్వక్ 'లైలా'.. OTTలోకి వచ్చాక ఏం జరుగుతుందో!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Feb 2025 5:38 AM GMT
విశ్వక్ లైలా.. OTTలోకి వచ్చాక ఏం జరుగుతుందో!
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లేడీ గెటప్ లో ప్రయోగాత్మకంగా విశ్వక్ చేసిన ఆ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా కనిపించింది. అయితే మూవీ మాత్రం విశ్వక్ సేన్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

నిజానికి.. టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో తెలుగు సినీ ప్రియుల్లో మంచి బజ్ నెలకొంది. కానీ కాన్సెప్ట్‌ లో కొత్త‌ద‌నం మిస్స‌వ్వ‌డం సహ పలు కారణాల వల్ల ఫ్లాప్ గా మారింది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువ కావ‌డంతో నెట్టింట ట్రోల్స్ రాగా, విశ్వక్ సేన్ సారీ చెప్పిన విషయం తెలిసిందే.

ఇకపై తన సినిమాల్లో అస‌భ్య‌త లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. త్వ‌ర‌లో బ‌ల‌మైన క‌థ‌తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తానంటూ తెలిపారు. అయితే విశ్వక్ సేన్ కు ఇప్పుడు మరో ఇబ్బంది ఎదురు కానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మళ్లీ మూవీపై భారీగా ట్రోల్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి.. ప్రస్తుత రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చాక సినిమాల్లోని కొన్ని సీన్స్ మీమ్ మెటీరియల్ గా మారడం కామన్ అయిపోయింది. రూల్, రూలర్, భోలా శంకర్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు.. భారీగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు లైలా విషయంలో అదే జరుగుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. మార్చి 7వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ మార్చి ఫ‌స్ట్ వీక్‌ లో రానుందని టాక్ వినిపిస్తోంది.

అయితే థియేటర్లలో సినిమాను ఎక్కువ మంది చూడకపోగా, ఇప్పుడు కొందరు చూసే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రోలింగ్ జరిగే అవకాశం కూడా అంతే ఉంది. అయితే లైలా త‌ర్వాత ప్రస్తుతం ఫంకీ మూవీ చేస్తున్న విశ్వక్ సేన్.. ఈ న‌గ‌రానికి ఏమైంది సహ పలు సినిమాల్లో నటించనున్నారు.