Begin typing your search above and press return to search.

హైప్ పెంచే కామెంట్.. తాప్సీ సూపర్ అంతే..!

సౌత్ సినిమాలతో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన వారిలో తాప్సీ ఒకరు. తెలుగు సినిమాల్లో నటించి అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ కి ప్రమోట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 5:30 PM GMT
హైప్ పెంచే కామెంట్.. తాప్సీ సూపర్ అంతే..!
X

సౌత్ సినిమాలతో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన వారిలో తాప్సీ ఒకరు. తెలుగు సినిమాల్లో నటించి అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ కి ప్రమోట్ అయ్యారు. అక్కడ మొదట కమర్షియల్ సినిమాల్లో నటించినా తర్వాత డిఫరెంట్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. బాలీవుడ్ లో కంగనా తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు తాప్సీ పన్ను. అంతేకాదు తనని కదిలిస్తే చాలు ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది.

ఆమధ్య సినిమాల్లో హీరోల డామినేషన్ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన తాప్సీ హిందీలో తన మాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా తన కొత్త సినిమా గాంధారి విషయాలను పంచుకుంటూ తన ఫ్యాన్స్ కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది తాప్సీ. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న గాంధారి సినిమాను దేవాశిష్ మఖిజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని చెబుతూ తన ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చింది తాప్సీ.

గాంధారి సినిమా షూటింగ్ మొదలైందని చెబుతూ ఒక కొటేషన్ ని కూడా తాప్సీ షేర్ చేశారు . సమయం వచ్చినప్పుడు నేను యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతూ మరణించాలి.. కానీ ఎప్పుడు శత్రువుల ముందు భయం ప్రదర్శించవద్దు.. ఇప్పుడు పోరాటం ప్రారంభిద్దాం అని తాప్సీ రాసుకొచ్చారు. ప్రతీకారం తీర్చుకునే మదర్ పాత్రలో తాప్సీ ఈ సినిమాలో కనిపించనున్నారు. గాంధారి సినిమాతో మరోసారి తన ప్రతిభ కనబరచాలని చూస్తున్నారు తాప్సీ. కనికా థిల్లాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ బాలీవుడ్ సినీ లవర్స్ ని అలరిస్తున్నాయి.

నటిగా ఎప్పుడూ తనలోని కొత్త టాలెంట్ ని వెలికి తీసేలా కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు తాప్సీ. అందుకే ఆమె అక్కడ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఐతే చేస్తున్న సినిమాల పాత్రలతోనే కాదు పర్సనల్ గా తను కూడా అంతే స్ట్రాంగ్ గా కనిపిస్తారు. కెరీర్ మొదట్లో ఇబ్బందులు పడ్డా ఇప్పుడు తను చేయాలనుకున్న కథలను అసలు విడిచి పెట్టకుండా చేస్తూ వస్తున్నారు తాప్సీ. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కూల్ గోయిన్ గా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు తాప్సీ.