Begin typing your search above and press return to search.

కోట్లల్లో యాపిల్ సీఈవో సెక్యూరిటీ ఖర్చు

By:  Tupaki Desk   |   10 Aug 2015 7:25 AM GMT
కోట్లల్లో యాపిల్ సీఈవో సెక్యూరిటీ ఖర్చు
X
ఏటా వేలాది కోట్ల రూపాయిల సంపదను సృష్టించే సెల్రబిటీలు.. బడా.. బడా పారిశ్రామికవేత్తల రక్షణ కోసం పెట్టే ఖర్చు వివరాలు వింటే నోట మాట రాని పరిస్థితి. అత్యంత కీలకమైన కంపెనీల సీఈవోల రక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి. మిగిలిన వారితో పోలిస్తే.. యాపిల్ కంపెనీ తన సీఈవో రక్షణ కోసం భారీగా ఖర్చు పెట్టటం గమనార్హం.

అధికారికంగా సమర్పించిన లెక్కల ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్ కాక్ వ్యక్తిగత రక్షణ కోసం ఏటా 7లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నాయి. నిజమే.. కంపెనీని అగ్రపథంలోకి దూసుకెళ్లేలా చేయటంతో పాటు.. కంపెనీకి వేల కోట్ల రూపాయిల డాలర్ల వర్షం కురిపిస్తున్న టిమ్ కాక్ రక్షణ కంపెనీకి అత్యంత అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కంపెనీలో అత్యుత్తమ జీతాలు జీతాలు ఇచ్చే టాప్ 12 మంది ఉద్యోగుల జీతం కంటే కూడా.. టిమ్ కాక్ రక్షణ కోసం ఖర్చు చేయటం మరో విశేషం. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం 7లక్షల డాలర్లు కేవలం రక్షణ కోసం ఖర్చు చేశారు. మిగిలిన అత్యుత్తమ కంపెనీల సీఈవోల రక్షణ కోసం భారీగా ఖర్చు పెడుతునప్పటికీ యాపిల్ సీఈవోతో పోలిస్తే తక్కువని చెబుతున్నారు.

ఒరాకిల్ తన సీఈవో రక్షణ కోసం 1.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుండగా.. అమెజాన్ తన సీఈవో రక్షణ కోసం 5.8లక్షల డాలర్లు ఖర్చు చేశారు. ఇక.. వారెన్ బఫెట్ తన రక్షణ కోసం 3.85 లక్షల డాలర్లను ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మిగిలిన సీఈవోలతో పోలిస్తే.. యాపిల్ సీఈవోకు మరో ఇబ్బంది ఉంది. తనకు తాను గే గా ప్రకటించుకున్న ఆయన్ను సంప్రదాయవాదులతో పాటు.. మత చాంధసవాదులు సైతం ఆయనపై కత్తి గట్టారు. దీంతో.. ఆయన రక్షణ కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.